Share News

గుండ్లపోచంపల్లిలో రెండో రోజూ కూల్చివేతలు

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:45 AM

మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ ఖాజీగూడ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతలు రెండో రోజూ కొనసాగాయి. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో పాటు, అధికారుల విధులను

గుండ్లపోచంపల్లిలో రెండో రోజూ కూల్చివేతలు

మేడ్చల్‌ టౌన్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ ఖాజీగూడ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతలు రెండో రోజూ కొనసాగాయి. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో పాటు, అధికారుల విధులను అడ్డుకున్న 9 మందిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని కోరుతూ తహసీల్దార్‌ శైలజ పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కట్టడాలు కూల్చడానికి వచ్చిన అధికారులను ఆక్రమణ దారులు అడ్డుకోవటంతో పూర్తిస్థాయిలో నిర్మాణాలను తొలగించలేకపోయారు. దీంతో భారీ బందోబస్తుతో మంగళవారం రెవెన్యూ అధికారులు తిరిగి కూల్చివేతలను చేపట్టగా కొందరు ఆక్రమణదారులు కూల్చటానికి తీసుకొచ్చిన ఎక్స్‌కవేటర్లకు అడ్డంగా పడుకుని ఇబ్బంది పెట్టారు. చివరికి అధికారులు పోలీసు బందోబస్తుతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన నిర్మాణాలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేశామని తహసీల్దార్‌ శైలజ పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఈఎ్‌సఐ డిస్పెన్సరీ కోసం కేటాయించిన ఎకరం స్థలాన్ని సర్వే చేసి హద్దులు పాతి ఆ శాఖ అధికారులకు అప్పగించామని తెలిపారు.

Updated Date - Nov 20 , 2024 | 04:45 AM