Share News

అన్నీ ఉన్నా.. నిరాశే

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:27 AM

గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని విద్యార్థులు, యువకులను క్రీడాకారులుగా త యారు చేయాలనే ఉద్దేశంతో ఇండోర్‌ స్టేడియాన్ని నిర్మించారు.

 అన్నీ ఉన్నా.. నిరాశే
ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన టేబుల్‌ టెన్నిస్‌ కోర్టు

అన్నీ ఉన్నా.. నిరాశే

ఉసూరుమంటున్న క్రీడాకారులు

ఔత్సాహికులకు కరువైన ప్రోత్సాహం

ఉద్యోగులు, వ్యాపారులకు ఆటవిడుపుగా మారిన ఇండోర్‌ స్టేడియం

నల్లగొండకల్చరల్‌, డిసెంబరు 26: గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని విద్యార్థులు, యువకులను క్రీడాకారులుగా త యారు చేయాలనే ఉద్దేశంతో ఇండోర్‌ స్టేడియాన్ని నిర్మించారు. పలు క్రీడాంశాల్లో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలి. కానీ నల్లగొండ పట్టణంలోని ఇండోర్‌ స్టేడియంలో వసతులు ఉన్నా శిక్షణ, పోటీలు కరువైన ట్లు పలువురు క్రీడారులు ఆరోపిస్తున్నారు. 2007 సంవత్సరంలో పట్టణంలోని ఎస్పీటీ మార్కెట్‌కు ఎదురుగా ఉన్న 1.20 ఎకరాల స్థలంలో ఇండోర్‌ స్టేడియంతో పాటు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో స్విమ్మింగ్‌ పూల్‌ను నిర్మించారు. ఇదే ప్రాంగణంలో టేబుల్‌ టెన్నీస్‌, షటిల్‌ బ్యాడ్మింటన వంటి కోర్టులను ఏర్పాటు చేశారు. వేసవిలో మాత్రమే స్విమ్మింగ్‌పూల్‌ పని చేస్తుండగా, టేబుల్‌ టెన్నిస్‌, షటిల్‌ బ్యాడ్మింటన క్రీడలు మాత్రం ఏడాది పొడవుగా సాగుతున్నాయి. టెబుల్‌ టెన్నీస్‌, షటిల్‌ బ్యాడ్మింటన క్రీడలకు చేరో మూడు కోర్టులను ఏర్పాటు చేశారు. టెబుల్‌ టెన్నిస్‌ క్రీడ మొదట్లో ముమ్మరంగా కొనసాగింది. ప్రస్తుతం అడపాదడపా శిక్షణ కొనసాగుతుందని క్రీడాకారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా చెస్‌ కోసం ఒక గదిని ఏర్పాటు చేయగా పోటీలు నిర్వహించిన సందర్భాలు చాలా తక్కువ. గతంలో ఇదే ప్రాంగణంలో జిమ్‌ ఉండేది. స్టేడియం ఆధునికీకరణలో భాగంగా దానిని తొలగించారు. నూతన పరికరాలతో వ్యాయామశాల ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరిగినా దానిని ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఇక్కడ వ్యాయామశాల సౌకర్యం లేకపోవడంలో యువకులు ఇబ్బంది పడుతున్నారు.

కోట్లాది రూపాయలతో ఆధునికీకరణ

ఇండోర్‌ స్టేడియంలో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌ రూ.1.90 కోట్లతో పునరుద్ధరించారు. స్వి మ్మింగ్‌పూల్‌ సౌకర్యాన్ని పట్టణ ప్రజలు ఉపయోగించుకునేందుకు వారి నుంచి రుసు ము వసూలు చేస్తారు. అంతేకాకుండా టెబుల్‌ టెన్నీస్‌, షటిల్‌ బ్యాడ్మింటన కోర్టులను నూతనంగా రూ.1.50 కోట్లతో పునరుద్ధరించారు. ఈ రెండు క్రీడలకు ప్రత్యేకంగా నా లుగు కోర్టులను ఏర్పాటు చేశారు. షటిల్‌ బ్యాడ్మింటన కోర్టులను సిథటింక్‌తో ఏర్పాటు చేశారు. అదే ప్రాంగణంలో తైక్వాండో, కరాటే క్రీడలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాత్రం వేసవిలో మాత్రమే నెల రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు విడతలుగా నాలుగు కోర్టుల్లో ఆట కొనసాగుతుంది. కానీ శిక్షణ పొందేవారు కాకుండా సుమారు 200 మంది పట్టణ ప్రముఖులు, వ్యాపారస్థులు ఆటలు ఆడుతున్నారు. రెండేళ్ల క్రితం ఇండోర్‌ స్టేడియంలో నూతనంగా క్రీడా భవనాలను పునరుద్ధరణ చేయడంతో ఇంటర్నేషల్‌ స్టేడియాలకు తగినట్లుగా తయారు చేశారు. క్రీడలకు రె గ్యులర్‌ కోచలను నియమించి ఔత్సహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తే ఇండోర్‌ స్టేడియం క్రీడాకారులతో నిత్యం కళకళలాడుతుందని కొందరు క్రీడాకారులు పేర్కొంటున్నారు.

పోటీలు ఏర్పాటు శూన్యం

షటిల్‌ బ్మాడ్మింటన క్రీడలకు రెగ్యులర్‌ కోచ ఉన్నారు. వారి సారథ్యంలోనే శిక్షణ సాగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు విద్యార్థులు, యువకులు శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్తున్నారు. ఇండోర్‌ స్టేడియంలో టోర్నమెం ట్లు పెట్టకపోవడంతో చాలామంది క్రీ డాకారులు క్రీడను నేర్చుకొని మధ్యలో నే మానేస్తున్నారు. గతంలో టేబుల్‌ టె న్నీస్‌ రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నిర్వహించారు. నూతనంగా క్రీడాకారులను తయారు చేయాలంటే ఫ్రీ కోచింగ్‌ క్యాంపులు నిర్వహించాలని పలువురు క్రీడాకారులు కోరుతున్నారు.

సౌకర్యాలు లేక ఇబ్బందులు

ఇండోర్‌ స్టేడియంలో మౌలిక సదుపాయాలు లేక క్రీడాకారు లు ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్‌ లేని సమయంలో ఆటలకు ఆటకంగా కలుగుతుంది. అంతేకాక తాగునీరు, ప్రతీ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారుల కోసం బాతరూమ్‌, టాయిలెట్స్‌, స్నా నాల గదుల వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. స్టేడియంలో జనరేటర్‌ ఏర్పాటు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, వ్యాయామశాలను తిరిగి ఏర్పాటు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లగా ఆయన కూడా సానుకూలంగా స్పం దించారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ఇండోర్‌ స్టేడియంలో అన్ని క్రీడలు ఏర్పాటు చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు. పట్టణ, గ్రామీణ క్రీడాకారులను గుర్తించి ప్రత్యేకంగా తర్ఫీదు ఇవ్వాలి.

జనరేటర్‌ సౌకర్యం కల్పించాలి

ఇండోర్‌ స్టేడియంలో క్రీడలకు అంతరాయం కలగకుండా జనరేటర్‌ సౌకర్యం కల్పించాలి. ఇటీవల కాలంలో ఉదయం, సాయంత్రం ఎక్కువ సార్లు కరెంట్‌ పోవడం వల్ల ఆటలకు అంతరాయం కలుగుతుంది. క్రీడాకారులకు తాగునీరు వసతి కల్పించాలి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా పోటీలు నిర్వహించాలి. యువకులను ప్రోత్సహించేందుకు క్రీడా వేదికను ఏర్పాటు చేయాలి.

పంతులు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి, షటిల్‌ బ్యాడ్మింటన అసోసియేషన

వ్యాయామశాలను ఏర్పాటు చేయాలి

యువకులు ఫిట్‌నె్‌సను పెంచుకునేందుకు ఇండోర్‌ స్టేడియంలో వ్యాయామ శాలను ఏర్పాటు చే యాలి. గతంలో ఇదే ప్రాంగణంలో జిమ్‌ సౌకర్యం ఉండేది. స్టేడియం పునరుద్ధణ సమయంలో దానిని తొలగించి మేఖల అభినవ్‌ స్టేడియానికి తరలించారు. దీంతో యు వకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు ఇంకా కల్పించాలి. అన్ని క్రీడలకు రెగ్యులర్‌ కోచలను నియమించాలి.

యాట గోవర్ధనరెడ్డి, అధ్యక్షుడు, షటిల్‌ బ్యాడ్మింటన అసోసియేషన

Updated Date - Dec 27 , 2024 | 12:27 AM