Share News

Summer Season: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. ఆ తేదీ వరకు అప్రమత్తత తప్పనిసరి

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:07 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Temperatures) మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 - 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

Summer Season: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. ఆ తేదీ వరకు అప్రమత్తత తప్పనిసరి

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Temperatures) మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 - 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వడగాలులు వీచాయి. ఆయా జిల్లాలకు భారత వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే ఠారెత్తిస్తున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ద్రోణి రూపంలో చల్లటి కబురు అందింది.


ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడగాలులు వీచే ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. పలు చోట్ల సాధారణంకంటే 4 - 8 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏప్రిల్‌లోనే ఎండ తీవ్రత ఇలా ఉందంటే.. మే నెల వచ్చేసరికి ఏ స్థాయిలో దాని ప్రభావం ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


ఏపీలో ఇదీ పరిస్థితి..

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎండలు మండుతున్నాయి. వడగాలుల ప్రభావంతో జనం అల్లాడుతున్నారు. ఇవాళ 40కి పైగా మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 175 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. తీపి కబురులా ద్రోణి ప్రభావం ఏపీపై కూడా పడనుంది.

ద్రోణి ఎఫెక్ట్‌తో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి.. మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కొనసాగుతోంది. రానున్న రెండు రోజులపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP Elections: ఏపీ ఎన్నికల్లో తొలి నామినేషన్ ఈయనదే..!

తెలంగాణ వార్త కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 18 , 2024 | 03:08 PM