Home » Telugu states
విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలు దూకుడు పెంచాయి. ఈ రోజు ఏపీలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు శాంతికుమారి, నీరబ్ కుమార్ ప్రసాద్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరికొన్ని సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టారు.
రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టంలోని అంశాలపై ఏపీలో తొలిసారిగా భేటీ అయ్యారు. అధికారుల కమిటీ సమావేశానికి ప్రాధాన్యం సంతరించకుంది.
తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలోని మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది. గతంలో బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన విశ్వప్రయత్నాలు సెప్టెంబర్-10 నాటితో ఫలించాయి. ఇక ఏపీకి కూడా శుభవార్తే వచ్చింది.. ఈ మేరకు మంగళవారం రాత్రి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ఆరోగ్య శాఖ రిలీజ్ చేసింది...
తెలంగాణలో ఖమ్మం జిల్లాను ముంచింది మున్నేరు.. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడను ముంచింది బుడమేరు. ఇటు మున్నేరు, అటు బుడమేరు అక్రమణలకు గురవడంతో పాటు ప్రణాళిక లేకుండా నిర్మాణాలకు అనుమతించడంతో భారీ వర్షం కురిసినప్పుడు వరద పోటెత్తి దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వరద తాకిడికి గురవుతున్నారు. వరదలు సంభవించినప్పుడు యథావిథిగా బురద రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.
Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తక్షణ వరద సహాయం అందించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... విపత్తు నిర్వహణ నిధులున్నా కేంద్రం వరద సాయం అందించడంలో అలసత్వం వహిస్తోందన్నారు. కేంద్ర బృందాలను వెంటనే తెలుగు రాష్ట్రాలకు పంపి నష్ట అంచనా వేసి సహాయం అందించాలని...
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం– జనసేన–బీజేపీ కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, నాయకులకు ఒక సూచన.. కాదు ఒక హెచ్చరిక కూడా! నిన్నటి జగన్ అండ్ కో అరాచక పాలనను...
చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆదివారాని(సెప్టెంబరు1)కి 30 ఏళ్లవుతున్నాయని టీడీ పీ నేతలు తెలిపారు.
‘మందుబాబులం.. మేము మందుబాబులం..’ అన్న మాట తెలుగునాట నిజమైంది. దేశవ్యాప్తంగా మద్యం వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) మరోసారి దృష్టి కేంద్రీకరించింది. ఈనెల 24న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది.
Andhrapradesh: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటి శుభ పరిణామమన్నారు. విభజన చట్టంలోని అంశాలు నీటి సమస్యలపై స్నేహపూర్వకంగా చర్చలు జరగాలన్నారు. రాజకీయాలకు తావు లేకుండా సమస్యల పరిష్కారానికి సీఎంలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.