ఇంటింటికీ అయోధ్య రామాలయ అక్షింతల పంపిణీ
ABN , Publish Date - Jan 10 , 2024 | 12:04 AM
అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను రామభక్తులు మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో ఇంటింటికీ పంపిణీ చేశారు. విశ్వహిందూపరిషత, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు అక్షింతల పంపిణీలో పాల్గొన్నారు.
మిర్యాలగూడ టౌన, జనవరి 9 : అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను రామభక్తులు మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో ఇంటింటికీ పంపిణీ చేశారు. విశ్వహిందూపరిషత, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు అక్షింతల పంపిణీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మునిసిపల్ చైర్మన తిరునగరు భార్గవ్ దంపతులతో పాటు పలువురికి అక్షింతలు అందజేశారు. కార్యక్రమాల్లో వీహెచపీ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్‌రెడ్డి, చెరుపల్లి కరుణాకర్, గూడూరు శ్రీనివాస్, గంజి సుధాకర్, తిప్పన వెంకటేశ్వర్లు, వనం మదనమోహన, ఉదయభాస్కర్, బిక్షపతి, సైదిరెడ్డి, వై.వెంకటేశ్వర్లు, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : మండలం అంగడిపేట ఎక్స్‌రోడ్డులో అక్కంపల్లి రామాలయ భక్తులు అక్షింతలను పంపిణీ చేశారు. అంతకుముందు దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఊరేగింపు నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతమంతా జైశ్రీరాంనినాదాలు మారుమోగాయి.
కనగల్ : మండలంలోని పగిడిమర్రి గ్రామంలో వీహెచపీ, ఆర్‌ఎ్‌సఎస్ ఆధ్వర్యంలో సర్పంచ గోలి నర్సిరెడ్డి అయోధ్య రామమమందిర అంక్షితలను ఇంటింటికీ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్రమాద యశోదమ్మ, మాజీ సర్పంచగోలి జగాల్‌రెడ్డి, ఎర్రమాద వెంకట్‌రెడ్డి, సుంకిరెడ్డి రవీందర్‌రెడ్డి, సంతోష్, షణ్ముఖచారి, వార్డు సభ్యులు సింగం సత్తయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.