తాగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభం
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:26 PM
మండలంలోని శేరిఅప్పారెడ్డిపల్లిలో హైదరా బాద్‌లోని కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఫౌండే షన్ సహకారంతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని బుధవారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ప్రారంభించారు.
చారకొండ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శేరిఅప్పారెడ్డిపల్లిలో హైదరా బాద్‌లోని కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఫౌండే షన్ సహకారంతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని బుధవారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలు కాకుండా శుద్ధి చేసిన సురక్షితమైన నీరు తా గాలని అన్నారు. ప్రజలు తమ ఇళ్ల ముందు నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అదేవిధంగా 200 మందికి ఉచితంగా వాటర్‌క్యాన్లు, ఎనీ టైం వాటర్ (ఏటీడబ్ల్యూ) కార్డులను పంపిణీ చేశారు. వాటర్‌ప్లాంట్ రూం దాత శేరిఅప్పా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన చల్లా శోభ రాంరెండి దంపతులను అభినందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోలి రంగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రామకృష్ణారెడ్డి, కొలుకులపల్లి మాజీ సర్పంచ్ బట్టు కిషన్‌రెడ్డి, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ఆపరేష న్ మేనేజర్ రమేష్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీని వాసరావు, ఎగ్జిక్యూటివ్ ముజీబ్, తిరుమల నాయుడు, సంతోష్, రాంరెడ్డి పాల్గొన్నారు.