Share News

Kumaram Bheem Asifabad- విద్యార్థులకు దసరా సెలవులు

ABN , Publish Date - Oct 01 , 2024 | 10:34 PM

పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు రావడంతో గురుకులాలు, వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇంటి బాట పట్టారు. బుధవారం నుంచి ఈ నెల 14 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో జిల్లా కేంద్రంలో వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు తమ సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. దీంతో మంగళవారం ఆర్టీసీ బస్టాండు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.

Kumaram Bheem Asifabad-    విద్యార్థులకు దసరా సెలవులు
ఆసిఫాబాద్‌ బస్టాండులో కిక్కిరిసిన ప్రయాణికులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 1: పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు రావడంతో గురుకులాలు, వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇంటి బాట పట్టారు. బుధవారం నుంచి ఈ నెల 14 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో జిల్లా కేంద్రంలో వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు తమ సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. దీంతో మంగళవారం ఆర్టీసీ బస్టాండు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మంచి ర్యాల, కాగజ్‌నగర్‌, బెజ్జూరు, ఆదిలాబాద్‌, వాంకిడి రూట్లలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఆర్టీసీ ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా బస్సులు సమయానికి నడపక పోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండులోనే నిరీక్షించాల్సి వచ్చింది. ఉన్న బస్సుల్లో కూడా ప్రయాణికులు కిక్కిరిసి వెళ్లాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కొంత మంది ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి తమ తమ గ్రామాలకు బయలుదేరి వెళ్లారు.

బెజ్జూరు: విద్యా సంస్థలకు దసరా సెలవులు ఇవ్వడంతో బెజ్జూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు తమ ఇంటి బాట పట్టారు. విద్యార్థులు వారి వారి గ్రామాలకు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక పోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రైవేటు వాహనాల్లోనే గమ్యస్థానాలకు చేరుకున్నారు.

Updated Date - Oct 01 , 2024 | 10:34 PM