భక్తి పారవశ్యం
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:26 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వాతి వేడుకలు, గిరిప్రదక్షిణ పర్వాలు గురు వారం వైభవంగా కొనసాగాయి.
గిరిప్రదక్షిణ ప్రారంభించిన విప్ అయిలయ్య, ఎంపీ చామల
భువనగిరి అర్బన్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వాతి వేడుకలు, గిరిప్రదక్షిణ పర్వాలు గురు వారం వైభవంగా కొనసాగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున 5:45 గంటలకు అర్చకులు వేద మంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాం సులచే మంగళవాయిద్యాల నడుమ అర్చకులు హారతి సమర్పించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గిరి ప్రదక్షి ణను ప్రారంభించారు. గిరిప్రదక్షిణ మహోత్సవంలో తెల్లవారు జామున స్వామి వారిని స్తుతిస్తూ ప్రత్యేక వేశాధారణలో కళాకారుల కోలాటాలు, నృత్యాలు, భజనలు, కీర్తనలు పాడారు. సుమారు 10వేల మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. వైకుంఠ ద్వారం నుంచి కొండకు పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో నూతనంగా నిర్మించిన మండపాల్లో భక్త ప్రహ్లాద, మునీశ్వరుడు యాద రుషీ విగ్రహాలను ప్రతిష్టించి ఎంపీతో కలిసి ప్రభుత్వ విప్ ప్రారంభించారు.
అష్టోత్తర శతఘటాభిషేక పూజలు
ఆలయంలో వేకువజామున అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిం చారు. సుప్ర భాత సేవతో స్వామిఅమ్మవారిని మేల్కొలిపి నిత్యారాధనలు జరిపిన అర్చకులు ఆస్థాన పరంగా ఆరాధనల అనంతరం ఉత్సవ మూర్తులకు హారతి నివేదించారు. ముఖమండపంలో 108కలశాలు వాటిపై కొబ్బరికాయలు పేర్చి అందులో పంచా మృతాలు నింపి పంచసూక్త పఠనాలతో హోమం చేపట్టి ఉత్సవమూర్తులను, ఆల ంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహ నామార్చనలు చేప ట్టారు. ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను వివిధ పుష్ప మాలికలు, పట్టువస్త్రాలు, బంగారు, వైజ్రవైఢూర్యాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై అఽధిష్ఠింపజేశారు. మంగళ వాయిద్యాల నడుమ వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు.
వైభవంగా ధనుర్మాసోత్సవాలు
ఆలయంలో చేపట్టిన ధనుర్మాసోత్సవాలు 11వ రోజుకు చేరాయి. గురు వారం జరిపిన వ్రతంలో ఉదయాన్నే బృందావనంలోని గోపికను వ్రతానికి సిద్ధం చేసిన పర్వం అలరించింది. కొండపైన వేడుకల సందర్భంగా ‘శ్రీ వెంకట అన్నమాచార్య సేవాట్రస్ట్ సంస్కృతి’ కూచిపూడి నృత్యం, తాళ్లపాక అన్నమయ్యచారి 12వ తరం వా రసుడు స్వామీజీ దివ్య మంగళ శాసనాలతో కార్యక్రమాలు రూపకల్పన చేశారు. భక్తి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చిరుతలతో భజన చేసి ఆకట్టుకున్నారు.
యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు
లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో నిత్య కైంకర్యాలు పాంచారాత్రగమశాస్త్ర రీతిలో వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ నైరుతి దిశలో అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ముత్యాలు, బంగారు, వజ్ర వైఢూ ర్యాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు గజవాహన సేవలో తీర్చిదిద్ది వేద మంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ సేవోత్సవం చేప ట్టారు. ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్టింపజేసి, విశ్వక్సేనుడి తొలి పూజలతో కల్యాణతంతు కొనసాగింది. పాతగుట్ట ఆలయంలో నిత్య పూజలు సాంప్రదాయ రీతిలో జరిగాయి. కొండపైన శివాలయంలో శ్రీపర్వతవర్ధిని రామలి ంగేశ్వరస్వామికి నిత్య పూజలు, యాగశాలలో నిత్య రుద్రహవనం శైవాగమ పద్ధతి లో నిర్వహి ంచారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.40,30,791ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏ. భాస్కర్‌రావు తెలిపారు. కొండపైన తిరువీధులు, ఉత్తర ప్రాకార మండపం, ప్రసాద కౌంటర్లు, శివాలయం వద్దకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వీఐపీ పార్కింగ్ నుంచి తూర్పు రాజ గోపురం భక్తులను తరలించేందుకు ఎలక్ట్రీకల్ వాహనాలు విని యోగించారు. సుమారు 34వేల మంది భక్తులు ఇష్టదైవాలను దర్శించుకున్నట్లు అధికారులు తెలి పారు. ప్రత్యేక దర్శనానికి అర్ధగంట ధర్మదర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు.