పోలీసుల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:30 PM
జిల్లా పోలీ సుల సంక్షేమానికి ఎస్పీ గైక్వా డ్ వైభవ్ రఘనాథ్ అవసర మైన నిధులను, వనరులను సమకూరుస్తూ పెద్దపీట వేస్తు న్నారని కలెక్టర్ బదావత్ సం తోష్ అన్నారు.
- పోలీస్ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ, ఐవోఎల్ మేనేజర్
నాగర్‌కర్నూల్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పోలీ సుల సంక్షేమానికి ఎస్పీ గైక్వా డ్ వైభవ్ రఘనాథ్ అవసర మైన నిధులను, వనరులను సమకూరుస్తూ పెద్దపీట వేస్తు న్నారని కలెక్టర్ బదావత్ సం తోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన పోలీస్ సంక్షేమ పెట్రోల్ బంకును ఎస్పీ, కలె క్టర్‌లు సికింద్రాబాద్ ఇండియన్ ఆయిల్ కా ర్పొరేషన్ లిమిటెడ్ సంస్థ డీఎం సుదీప్తోమిత్ర, అదనపు ఎస్పీలతో కలిసి బుధవారం ప్రారం భించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ పోలీస్ సంక్షేమ నిధికి కొద్ది మొత్తంలో మాత్రమే నిధులు మంజూరయ్యాయని తెలి పారు. దీంతో జిల్లా పోలీస్ శాఖను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కొన్ని వాణిజ్య నిర్మా ణాలు చేపట్టి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పోలీస్ సంక్షేమానికి వినియోగించనున్నట్లు తెలిపారు. అందుకు అవసరమైన వనరులు, సదుపాయాలను కల్పించడంలో ఎస్పీ పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ అనుమతులు తదితర వసతు లను ఏర్పాటు చేసేందుకు అదనపు ఎస్పీ భరత్‌కుమార్ కృషి చేశారని తెలుపుతూ ఆ యనను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజ లకు నాణ్యమైన ఇంధనాన్ని అందించి ప్రజల మన్ననలతో దినదిన అభివృద్ధికి కృషి చేయా లని, పోలీస్ సంక్షేమానికి పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అ దనపు ఎస్పీలు రామేశ్వర్, భరత్‌కుమార్, ఇం డియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు, డీఎస్పీలు సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.