Share News

టాస్క్‌ పోరాట ఫలితంగా వృద్ధుల సంరక్షణ పాలసీ

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:47 AM

తెలంగాణ ఆల్‌ ఇండియా సీనియర్‌ సిటిజన్స్‌ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వృద్ధుల సంరక్షణ పాలసీని రూ పొందిండానికి నిర్ణయం తీసుకుందని టాస్క్‌ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అఽధ్యక్షుడు హరి ఆశోక్‌ కుమార్‌ అన్నారు.

టాస్క్‌ పోరాట ఫలితంగా వృద్ధుల సంరక్షణ పాలసీ
సిటిజన్స్‌ చట్టం పుస్తకం ఆవిష్కరిస్తున్న సంక్షేమ సంఘ సభ్యులు

- సీనియర్‌ సిటిజన్స్‌ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్‌ కుమార్‌

కోరుట్ల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఆల్‌ ఇండియా సీనియర్‌ సిటిజన్స్‌ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వృద్ధుల సంరక్షణ పాలసీని రూ పొందిండానికి నిర్ణయం తీసుకుందని టాస్క్‌ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అఽధ్యక్షుడు హరి ఆశోక్‌ కుమార్‌ అన్నారు. బుధవారం కోరుట్ల డివిజన్‌ సిటిజన్స్‌ అసోసియే షన్‌ కార్యాలయంలో కేంద్ర వృద్ధుల సంరక్షణ పాలసీ, సంక్షేమ చట్టానికి సవరణలు అవే అంశంపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరి ఆశోక్‌కుమార్‌ మాట్లాడారు. కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్‌ యాదవ్‌ వృద్ధుల సంరక్షణ పాలసీని రూపొందించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆధ్వర్యంలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్‌, జీవాకర్‌ రెడ్డి, నక్క శ్రీనివాస్‌ వృద్ధుల నిరాదరణ కేసులు సత్వరంగా పరిష్కరిస్తూ రాష్ట్రంలోని ముందు వరుసలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పబ్బా శివానందం, గంటేడి రాజ్‌ మోహన్‌, సైపోద్దిన్‌, లక్ష్మినారాయణ, రాజేశ్వర్‌, గంగారాంలతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:47 AM