Kumaram Bheem Asifabad- వృద్ధులను గౌరవించాలి
ABN , Publish Date - Oct 01 , 2024 | 10:40 PM
వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్ధుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలని చెప్పారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 1: వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్ధుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలని చెప్పారు. వారి కుటంబ సంక్షేమం కోసం పటిష్టమైన చట్టలు తీసుకు వచ్చారని అన్నారు. వారి సంక్షేమం, పోషణ పట్ల నిర్లక్ష్యం వహించిన కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. వారి సంరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. వృద్ధులు తమ సమస్యలపై నేరుగా తనను కలవవచ్చని తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలో వృద్ధాశ్రమం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలె క్టర్ దాసరి వేణు, జిల్లా సంక్షేమ శాఖాధికారి భాస్కర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాం, వయో వృద్థుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బుచ్చమ్మ, కార్యదర్శి లక్ష్మీనారాయణ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, సఖి కేంద్రం సిబ్బంది, సాధికారత కేంద్రం సభ్యులు తది తరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయం
- రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆసిఫాబాద్, అక్టోబరు 1: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోం దని రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైద రాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పురపాలక శాఖ కార్యదర్శి దాన కిశోర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్‌చౌహాన్, విద్యుత్ నిర్వహణ కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల అధికారులతో మాట్లాడారు. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే, ఉడా ఏర్పాటు, అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన, డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటా యింపు, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులు, చెరువుల మరమ్మతుల పనులు, వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అదికార యంత్రాంగం సమన్వయం తో అహార్నిశలు కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో కృషి చేసి అర్హత గల లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవా లని చెప్పారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నియోజక వర్గానికి రెండు గ్రామాల చొప్పున తెలంగాణ డిజిటల్ ఫ్యామిలీ కార్డుల సర్వేకు పైలేట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని చెప్పారు. సర్వే చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.. అనుమతి లేని లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద 7,698 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రతి దరఖాస్తుపై రెవెన్యూ,పంచాయతీరాజ్, మున్సిపల్ ఇరిగే షన్, అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీంచేందుకు ప్రత్యక బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించనున్నామని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేం దుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను అధికారుల సమన్వయంతో జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య, డీపీవో ఉమర్‌హుస్సేన్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.