Share News

ఎన్నికల నామ సంవత్సరం

ABN , Publish Date - Jan 02 , 2024 | 12:03 AM

ఈ నూతన సంవత్సరం పార్టీల నాయకులు, ప్రస్తు త ప్రజా ప్రతినిధులకు కీలకం కానుంది. పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు ఈ ఏడా దే జరుగనున్నాయి.

ఎన్నికల నామ సంవత్సరం

ఈ నూతన సంవత్సరం పార్టీల నాయకులు, ప్రస్తు త ప్రజా ప్రతినిధులకు కీలకం కానుంది. పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు ఈ ఏడా దే జరుగనున్నాయి. ఈ క్రమంలో గ్రామస్థాయి నుంచి పార్లమెంట్‌ స్థాయి నాయకుల వరకు అదృష్టాన్ని పరీక్షించుకునే కాలంగా ఈ ఏడాది నిలువనుంది. ఈ సంవత్సరం చివరి నాటికి ప్రజా ప్రాతినిధ్యం, రాజకీయ పార్టీల నాయకత్వంలో పెనుమార్పులు జరుగనున్నాయి. దీంతో ఏడాదంతా రాజకీయ రగడ నెలకొననుంది. ఈ ఏడాదిలో సాధించాల్సిన లక్ష్యాలను పలువురు నిర్దేశించుకోవడం సర్వసాధారణమైన నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా 2024 సంవత్సరంలో తమకు అంతా శుభమే కలుగాలని తొలి రోజు నుంచే ఆరాట పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

- భువనగిరి టౌన

ఉమ్మడి జిల్లాలో సుమారు 18,661 మంది రాజకీయ భవిష్యతను నిర్ణయించే సంవత్సరం ఇది. ప్రస్తుత పార్లమెం ట్‌ కాలపరిమితి మే నెలతో ముగిస్తుంది. ఆ లోపే సార్వత్రి క ఎన్నికలు రానున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని భువనగిరి, నల్లగొండ పార్లమెంట్‌ స్థానాల్లో రాజకీయ భవిష్యతను పలువురు పరీక్షించుకోనున్నారు.అదేవిధంగా ఉమ్మ డి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవ ర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో అనివార్యమైన ఉపఎన్నిక కోసం ఎన్నికల కమిషన ఇటీవల ఓటరు జాబి తా సవరణ షెడ్యూల్‌ను ప్రకటించింది. త్వరలోనే ఎన్నికల కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు స్పష్టమైంది. అలాగే ప్రస్తు త సర్పంచల పదవీకాలం ఈ ఏడాది జనవరి 31తో ముగియనుంది. దీంతో గడువు లోపు గ్రామపంచాయతీ ఎన్నిక లు నిర్వహించాల్సి ఉన్నా నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండడంతో కొద్దిమేర ఆలస్యంగా నిర్వహించే అవకా శం ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1,740 గ్రామపంచాయతీల సర్పంచలకు, సుమారు 15,660మంది వార్డుసభ్యు ల రాజకీయ భవిష్యతను ఈ ఏడాది నిర్ణయించనుం ది. అలాగే ప్రస్తుత ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంసీటీల కాల పరిమితి మే నెలతో ముగుస్తుంది.దీంతో ఉమ్మడి జిల్లాలోని 74 మం డలాల పరిధిలోని 764 మంది ఎంపీటీసీలు, 74 మంది జడ్పీటీసీల, ఎంపీపీల, వైస్‌ఎంపీపీల రాజకీయ భవిష్యతలు కూడా 2024 సంవత్సరం నిర్ణయించనుంది. ఉమ్మడి జిల్లాలోని 19 మునిసిపాలిటీలకూ ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు నిర్వహించడం అనివార్యం కానుంది. దీంతో 420 మంది కౌన్సిలర్లు, 19 మంది చైర్మన్లు, వైస్‌చైర్మన్ల రాజకీయ భవితవ్యం నిర్ణయం కానుంది.

రాజకీయ పార్టీల్లోనూ

ప్రజాప్రతినిధుల భవిష్యతతో పాటు రాజకీయపార్టీలకు నాయకత్వం వహిస్తున్న నాయకులకు ఈ ఏడాది కీలకంకానుంది. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి సీఎం గా పదవీ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి త్వరలోనే నూతన టీపీసీసీ అధ్యక్షుడు రానున్నారని ప్రచా రం అవుతున్న విషయం విదితమే. దీంతో ఉమ్మడి జిల్లాలోని 3 జిల్లాల ప్రస్తుత అధ్యక్షులు డీసీసీ అధ్యక్షులు కూడా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల అధ్యక్షుల మార్పు తధ్యమని బీజేపీ ఇస్తున్న లీకేజీలతో ఆ పార్టీలో హడావిడి నెలకొం ది. జిల్లా నాయకత్వం తో పాటు ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర నాయకులుగా చెలామణి అవుతున్న నాయకులకు ఈ ఏడాది పరీక్ష పెట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి గురైన బీఆర్‌ఎస్‌ కూడా సంస్థాగత మార్పులకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే వామపక్షాల నాయకత్వం మార్పుపై కూడా విస్తృతంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది రాజకీయ నాయకుల పార్టీ నాయకత్వంలో పెనుమార్పులు జరిగే అవకాశాలు ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Updated Date - Jan 02 , 2024 | 12:03 AM