Share News

గ్రామాల్లో పాడిపశువుల పెంపకానికి ప్రోత్సాహం

ABN , Publish Date - Dec 24 , 2024 | 01:00 AM

గ్రామాల్లో పాడిపశువుల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తుందని డీఆర్‌డీవో పీడీ శేఖర్‌రెడ్డి అన్నారు.

 గ్రామాల్లో పాడిపశువుల పెంపకానికి ప్రోత్సాహం
తాళ్లవెల్లంలలో పాడి రైతులతో మాట్లాడుతున్న పీడీ శేఖర్‌రెడ్డి

గ్రామాల్లో పాడిపశువుల పెంపకానికి ప్రోత్సాహం

డీఆర్‌డీవో పీడీ శేఖర్‌రెడ్డి

చిట్యాలరూరల్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పాడిపశువుల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తుందని డీఆర్‌డీవో పీడీ శేఖర్‌రెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామంలో సోమవారం పశువుల పంపిణీ కార్యక్రమానికి పీడీ హాజరై పశువుల పెంపకం షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి రో జుల్లో ఇంటింటికీ గేదెలు, ఆవులు ఉండేవని, దీంతో రైతులకు లాభదాయకంగా ఉండేదన్నారు. ప్రస్తుతం పశువుల పెంపకంపై రైతు లు ఆసక్తిని కనబరచకపోవడం బాధాకరమన్నారు. ఐకేపీ పథకం లో భాగంగా మండలంలో 26 గేదెలను పంపిణీ చేసేందుకు లక్ష్యం గా పెట్టుకున్నామని, 13 పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఒ క్కో గేదెకు రూ.1లక్ష బీమా సౌకర్యంతో మంజూరు చేసినట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకం ద్వారా షెడ్ల నిర్మాణానికి నిధులు మం జూరు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం పద్మ, ఏపీ వో శ్రీలత, ఎంపీవో సత్యనారాయణ, సంఘ బంధం అధ్యక్షురాలు, సీసీలు, వీవోఏ, ఎఫ్‌ఏ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 01:00 AM