Epack Prefab : ‘ఈప్యాక్ ప్రీఫ్యాబ్’.. వెరీ ఫాస్ట్!
ABN , Publish Date - Nov 27 , 2024 | 05:38 AM
లక్షన్నర చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఒక పరిశ్రమను నిర్మించాలంటే.. రెండు మూడు నెలలు పడుతుంది. పనులు ఎంత వేగంగా చేసినా కనీసం నెల రోజులైనా కావాలి. కానీ.. ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్
150 గంటల్లోనే పరిశ్రమ నిర్మాణం పూర్తి
‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు
తడ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): లక్షన్నర చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఒక పరిశ్రమను నిర్మించాలంటే.. రెండు మూడు నెలలు పడుతుంది. పనులు ఎంత వేగంగా చేసినా కనీసం నెల రోజులైనా కావాలి. కానీ.. ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) నిర్మాణ సంస్థ ‘ఈప్యాక్ ప్రీఫ్యాబ్’ ఏపీలోని తిరుపతి జిల్లా మాంబట్టు పారిశ్రామిక వాడలో రికార్డు స్థాయిలో 150 గంటల్లోనే ఒక భారీ పరిశ్రమను నిర్మించి ఔరా అనిపించింది. దీంతో భారత్‌లోనే అత్యంత వేగంగా నిర్మాణం పూర్తయిన పరిశ్రమగా ఇది ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. మంగళవారం ఈ పరిశ్రమను ప్రారంభించారు. కార్యక్రమంలో ‘ఈప్యాక్ ప్రీఫ్యాబ్’ సంస్థ ఎండీ సంజయ్ సింఘానియా, ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ఆసియా హెడ్ మనీష్ వైష్ణోయ్ పాల్గొన్నారు.