Share News

తెల్ల రేషన్‌కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ

ABN , Publish Date - Jan 30 , 2024 | 04:10 AM

ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి అనే నిబంధనను సడలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులను అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డుకు ఒక విశిష్ట సంఖ్యను కేటాయించాలని, దీని వల్ల అత్యవసర పరిస్థితుల్లో వైద్యం

తెల్ల రేషన్‌కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ

అందరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు

ఆరోగ్యశ్రీతో వాటి అనుసంధానం

ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం

వైద్య కళాశాలల వద్దే నర్సింగ్‌,

ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలు

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో పూర్తి సేవలపై దృష్టి

సీఎస్‌ఆర్‌ నిధులతో ఆస్పత్రుల్లో హౌస్‌కీపింగ్‌

వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌

హౌసింగ్‌ బోర్డు బకాయిలెన్ని?

దాని పరిధిలోని వెంచర్ల పరిస్థితి ఏంటి?

హౌసింగ్‌ శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

1000 కోట్ల బకాయిలున్నాయన్న అధికార్లు

వాటన్నింటినీ వసూలు చేయాలన్న సీఎం

2004-14 మధ్య ఇందిరమ్మ ఇళ్లపై ఆరా

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి అనే నిబంధనను సడలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులను అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డుకు ఒక విశిష్ట సంఖ్యను కేటాయించాలని, దీని వల్ల అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్డులతో ఆరోగ్యశ్రీ సేవలను అనుసంధానించాలని సూచించారు. సోమవారం ఆయన సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ కార్డుకోసం తెల్ల రేషన్‌కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. ‘‘వైద్య కళాశాల ఉన్న చోటనర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలి. అందుకోసం ఓ సంయుక్త విధానాన్ని తీసుకురావాలి. వైద్య కళాశాలల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగాలి. వరంగల్‌, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌లోని టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి. వైద్యుల కొరత లేకుండా మెడికల్‌ కాలేజీలను ఆస్పత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడాలి’’ అని అధికారులను ఆదేశించారు. కొడంగల్‌లో మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటుకు పరిశీలన జరపాలని సూచించారు. ‘‘బీబీనగర్‌ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. ఎయిమ్స్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. దీనివల్ల ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రులపై భారం తగ్గుతుంది. ఎయిమ్స్‌పై పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలి. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యసేవల కోసం అవసరమైతే నేనే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానను’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు వైద్య సేవల కోసం హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా.. ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలను కల్పించాలన్నారు.

ఉస్మానియా ఆస్పత్రి విస్తరణలో సమస్యలు

ఈ సమీక్ష సందర్భంగా అధికారులు ఉస్మానియా ఆస్పత్రి విస్తరణలో సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఉస్మానియా ఆస్పత్రి ఉన్న భవనం వారసత్వ కట్టడం కావడం వల్ల కోర్టులో కేసు కొనసాగుతోందని వివరించారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ.. న్యాయస్థానం సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుందామన్నారు. మెడికల్‌ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో హౌస్‌కీపింగ్‌ నిర్వహణ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలకు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి(సీఎ్‌సఆర్‌) కింద అప్పగించాలన్నారు. సీఎ్‌సఆర్‌ నిధులతో హౌస్‌కీపింగ్‌ సేవలను మెరుగుపరచాలని సూచించారు. ఉస్మానియా లేదా గాంధీ ఆస్పత్రిలో పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించాలని ఆదేశించారు.

జీతాలు.. ఆరోగ్యశ్రీ బిల్లులపై..

జూనియర్‌ డాక్టర్లు, ఆశా వర్కర్లు, స్టాఫ్‌ నర్సుల జీతాలను ప్రతినెలా క్రమం తప్పకుండా అందించేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 108, 102 సేవల పనితీరుపై ఆరా తీశారు. వీటిద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వాస్పత్రులకు ప్రతినెలా 15వ తేదీలోగా ఆరోగ్యశ్రీ బిల్లులను విధిగా విడుదల చేయాలని సూచించారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలతో అనుసంధానంగా వున్న బోధనాస్పత్రులు, ప్రభుత్వ ఆస్పత్రులకు పెండింగ్‌లో ఉన్న రూ.270 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతీ మూడు నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

రేపు స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రాలు

ప్రభుత్వం కొత్తగా నియమించిన స్టాఫ్‌ నర్సులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమం బుధవారం ఎల్‌బీ స్టేడియంలో జరగనుంది. ఆ ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర ఉన్నతాధికారులు సోమవారం పరిశీలించారు.

Updated Date - Jan 30 , 2024 | 04:10 AM