Share News

ప్రతీ ఊరుకు రోడ్డు ఉండాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:14 PM

నియోజకవర్గంలో ప్రతీ ఊరుకు రోడ్డు ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక సీవీఆర్‌ బంగ్లాలో పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.

 ప్రతీ ఊరుకు రోడ్డు ఉండాలి
పంచాయతీ రాజ్‌ అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి

- ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

- జాబితాను తయారు చేయాలని ఆదేశం

నారాయణపేట, జనవరి 5: నియోజకవర్గంలో ప్రతీ ఊరుకు రోడ్డు ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక సీవీఆర్‌ బంగ్లాలో పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో రహదారి సౌకర్యం లేని గ్రామాలు, గిరిజన తండాల జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్‌ శాఖ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన పనులు, జరుగుతున్న పనుల వివరాలను సిద్ధం చేయాలని, టెండర్లు పూర్తైనా పనులు ప్రారంభించని వాటిని రద్దుచేసి కొత్త టెండర్లను పిలవాలని సూచించారు. నియో జకవర్గంలో శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్‌ పొందిన రోడ్ల టెండరు జాబితాను ఇవ్వాలని కోరారు. ఇప్పటి నుంచి జరిగే అభివృద్ధి పనులపై దృష్టి సారించా లని, కోయిల్‌ కొండ మండలంలో ప్రారంభం కా నీ రోడ్ల టెండర్లు రద్దు చేసి కొత్తవి పిలవాలని, మారుమూల ప్రాంతాల నుంచి మండల కేంద్రా లకు రోడ్డు సౌకర్యం ఉండాలని కోరారు. రాజకీ య ఒత్తిడిలను పక్కన బెట్టి ప్రగతి పనులను పరుగెత్తించాలని సూచించారు. ఈనెల 28వరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రా మాలకు అవసరమైన రోడ్ల నిర్మాణాల పనుల ప్రతిపాదన లు సిద్ధం చేయాలని ఆమె అధికా రులను ఆదే శించారు. సమావేశంలో పీఆర్‌ ఈఈ హీర్యా, డిప్యూటీ ఈఈలు నరేందర్‌, బాబురావు, కోయలకొండ డిప్యూటీ ఈఈ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:14 PM