Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని.. ఏఐఎస్‌ఎఫ్‌ ఆందోళన

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:36 AM

వి ద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షి ప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో వి ద్యార్థులు ఆందోళన నిర్వహించారు. మంగళ వారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యా లయం ప్రధాన గేటు వద్ద ధర్నా చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని..  ఏఐఎస్‌ఎఫ్‌ ఆందోళన
ర్యాలీగా వస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

జగిత్యాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): వి ద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షి ప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో వి ద్యార్థులు ఆందోళన నిర్వహించారు. మంగళ వారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యా లయం ప్రధాన గేటు వద్ద ధర్నా చేశారు. సు మారు గంట పాటు బైఠాయించారు. ఫ్లెక్సీలు, ఫ్లకార్డుల ప్రదర్శన చేస్తూ ప్రభుత్వ తీరుకు వ్య తిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఏఐఎస్‌ ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికం ఠరెడ్డి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీ యింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌ బకాయిలను వెం టనే విడుదల చేయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట ఒక తీరు పని మరో తీరుగా వ్యవహరిస్తు న్నారని ఆరోపిం చారు. ఈనెల 27వ తేదీలోపు ఫీజు బకా యిలను విడుదల చేయకంటే చలో ఇందిరాపార్క్‌ కార్యక్రమాన్ని చేపడుతా మని హెచ్చరించారు. వేలాది మంది విద్యార్థులను హైద్రా బాద్‌ నగరాన్ని దిగ్బందం చేస్తామన్నారు. సకాలంలో ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వా పోయారు. ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళా శాల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అక్రమ్‌ మాలిక్‌, బచ్చల రమేశ్‌, మచ్చ నితిన్‌, మంద రాకేశ్‌, రాజేశ్‌, వేణు, ప్రణ య్‌, నరేశ్‌, అరవింద్‌, నాగలక్ష్మీ, సౌమ్య చ శిరీష, పర్హాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:36 AM