పోటీ పరీక్షలకు ఫీజులు మాఫీ చేయాలి
ABN , Publish Date - Mar 27 , 2024 | 10:57 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ఉద్యోగ పోటీ పరీక్షలకు ఫీజు లేకుండా అప్లికేషన్లు తీసుకోవాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున డిమాండ్ చేశారు.
పోటీ పరీక్షలకు ఫీజులు మాఫీ చేయాలి
బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున
నల్లగొండటౌన, మార్చి 27: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ఉద్యోగ పోటీ పరీక్షలకు ఫీజు లేకుండా అప్లికేషన్లు తీసుకోవాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున డిమాండ్ చేశారు. పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం రేవంతరెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హా మీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని పేర్కొన్నారు. సమావేశంలో బీ ఆర్‌ఎస్ వి ద్యార్థి విభాగం నాయకులు నోముల క్రాంతియాదవ్, రొమ్ముల నాగ య్య, నోము ల శంకర్‌యాదవ్, సురే్‌షరెడ్డి, సుందర్, కిరణ్, వెంకన్న, లింగస్వా మి, హరీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.