Manchiryāla- రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Jan 17 , 2024 | 09:50 PM
వాహనదారులు, పాదాచారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్‌లోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జిల్లా రవాణాశాఖ అధికారి కిష్టయ్యతో కలిసి 37వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు -2024 బ్యానర్లు, గోడ ప్రతులు, స్టిక్కర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 17: వాహనదారులు, పాదాచారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్‌లోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జిల్లా రవాణాశాఖ అధికారి కిష్టయ్యతో కలిసి 37వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు -2024 బ్యానర్లు, గోడ ప్రతులు, స్టిక్కర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు భద్రత నిబందనలు పాటించడం ద్వారాసురక్షితమైన ప్రయాణం చేయవచ్చన్నారు. ఫిబ్రవరి 14వ తేదీ వరకు జిల్లాలో రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించనున్నామని చెప్పారు. రోడ్డు బద్రతపై ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నామన వివరించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని చెప్పారు. మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రయాణికులను గమ్య స్ధానాలకు చేరవేసే ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు రవాణా వాహనాలు పరిమితికి మించి తీసుకెళ్లకూడదని తెలిపారు.