Share News

Harish Rao : చేసింది చెప్పలేక కేసీఆర్‌ను తిడతావా?

ABN , Publish Date - Nov 20 , 2024 | 05:12 AM

అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసిందేమీ లేదు.. నువ్‌ ఏంచేశావో చెప్పలేక పిచ్చి మాటలు మాట్లాడి.. కేసీఆర్‌ను తిడతావా? కాంగ్రెస్‌ విజయోత్సవ సభలో 11 నెలల ప్రగతి చెప్పకుండా కేసీఆర్‌ నామస్మరణ

Harish Rao : చేసింది చెప్పలేక కేసీఆర్‌ను తిడతావా?

ఆయన నామస్మరణ చేసినంతనే నీ పాపం పోదు

శాతగానోనికి మాటలు.. చేవలేనోనికి బూతులెక్కువ

కాంగ్రెస్‌ జరపాల్సింది అపజయోత్సవాలు: హరీశ్‌

రేవంత్‌ పరిస్థితి అలాగే ఉంది:హరీశ్‌

హైదరాబాద్‌/సుభా్‌షనగర్‌(నిజామాబాద్‌), నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసిందేమీ లేదు.. నువ్‌ ఏంచేశావో చెప్పలేక పిచ్చి మాటలు మాట్లాడి.. కేసీఆర్‌ను తిడతావా? కాంగ్రెస్‌ విజయోత్సవ సభలో 11 నెలల ప్రగతి చెప్పకుండా కేసీఆర్‌ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. వరంగల్‌ సభలో సీఎం వ్యాఖ్యలపై మంగళవారం ఒక ప్రకటనద్వారా ఆయన స్పందించారు. ‘శాతగానోనికి మాటలెక్కువ. చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లుగా ఆయన పరిస్థితి ఉంది. నువ్వెంత గింజుకున్నా లాభంలేదు. అశోక్‌నగర్‌ నిరుద్యోగుల నుంచి లగచర్ల దాకా, రైతుల నుంచి గిరిజన బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు. కేసీఆర్‌లాంటి గొప్పవ్యక్తి నీ జీవితంలో అర్థంకాడు. తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవ్‌. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ నాయకులను తొక్కినవ్‌.. షార్ట్‌కట్‌లో అధికారం చేజిక్కించుకొని ఇప్పుడు ప్రజలను తొక్కుతున్నావ్‌’ అని హరీశ్‌ ధ్వజమెత్తారు.అన్నివర్గాలను విజయవంతంగా మోసంచేసిన కాంగ్రెస్‌ జరపాల్సింది విజయోత్సవం కాదని, అపజయోత్సవాలని పేర్కొన్నారు. ఏం సాధించావని సంబరాలు జరుపుకొంటున్నావని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కాగా, నిజనిర్ధారణ కోసం లగచర్లకు వెళ్తున్న సామాజిక కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని హరీశ్‌రావు మండపడ్డారు. పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ఇతర మహిళాసభ్యుల పట్ల ప్రభుత్వ నిరంకుశవైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

అధికారం ఉందని సాధారణ ప్రజలనే కాదు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలను నిర్బంధాలకు గురిచేస్తున్నారని, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నిర్బంధ, నిరంకుశ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. కాగా ఈ ఏడాది సెప్టెంబరు 9న కాళోజి జయంతి సందర్భంగా, సాహితీవేత్త నలిమెల భాస్కర్‌కు కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం ప్రకటించి ఇప్పటివరకూ ప్రదానం చేయకపోవడం శోచనీయమని హరీశ్‌ రావు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ బీఆర్‌ఎ్‌సపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా కాంగ్రె్‌సలో జరుగుతున్న కుమ్ములాటల గురించి పట్టించుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే ఆ పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ కాదు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీయే మూసీలో మునగడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో ఎవరిని కదిలించినా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోందని, నిర్లక్ష్య పాలనతో కాంగ్రె్‌సపార్టీ తనగొయ్యిని తానే తవ్వుకుంటోందని విమర్శించారు.

Updated Date - Nov 20 , 2024 | 05:12 AM