Share News

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల నిర్ధారణకు.. ఎన్‌ఆర్‌ఎస్‌సీ చిత్రాల డేటా వినియోగం

ABN , Publish Date - Dec 25 , 2024 | 05:55 AM

చెరువుల ఎఫ్‌ఎటీఎల్‌, బఫర్‌ జోన్లను గుర్తించేందుకు 1973 నుంచి 2024 వరకు నమోదైన వర్షపాతం,

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల నిర్ధారణకు.. ఎన్‌ఆర్‌ఎస్‌సీ చిత్రాల డేటా వినియోగం

1973 నుంచి 2024 వరకు వర్షపాతం, చెరువుల్లో నీటిని పరిగణనలోకి తీసుకుంటాం

ముంపు పరిష్కారానికి చర్యలు: ఎంవీ రంగనాథ్‌

ఎన్‌ఆర్‌ఎ్‌ససీ అధికారులతో భేటీ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): చెరువుల ఎఫ్‌ఎటీఎల్‌, బఫర్‌ జోన్లను గుర్తించేందుకు 1973 నుంచి 2024 వరకు నమోదైన వర్షపాతం, చెరువుల్లో నిలిచిన నీటికి సంబంధించిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎ్‌ససీ) శాటిలైట్‌ చిత్రాల డేటాను వినియోగించుకుంటామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. అధిక సాంద్రత (హై రెజల్యూషన్‌)తో ఉండే ఎన్‌ఆర్‌ఎ్‌ససీ చిత్రాలు.. పార్కులు, ప్రభుత్వ స్థలాలు, వరద ముంపు ఉన్న ప్రాంతాల గుర్తింపునకూ ఉపకరిస్తాయన్నారు. మంగళవారం ఎన్‌ఆర్‌ఎ్‌ససీ డైరెక్టర్‌ ప్రకాష్‌ చౌహాన్‌, డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివా్‌సతో బాలానగర్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో రంగనాథ్‌ సమావేశమయ్యారు. వరదలు వచ్చినప్పుడు ఏ ప్రాంతాలు నీట మునిగాయి? వరద కాలువల ఉధృతి ఎలా ఉంది? చెరువుల ఎఫ్‌టీఎల్‌ వంటి విషయాలను అన్ని కోణాల్లో పరిశీలించి భవిష్యత్తులో ముంపు ముప్పు లేకుండా అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు.

సర్వే ఆఫ్‌ ఇండియా, సర్వే ఆఫ్‌ తెలంగాణ, గ్రామీణ మ్యాపుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, ఎన్‌ఆర్‌ఎ్‌ససీని భాగస్వామ్యం చేయడం ద్వారా మరింత స్పష్టమైన సమాచారం తెలుస్తుందని చెప్పారు. ఇక ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల నిర్ధారణలో నిర్దిష్ట విధానాలు పాటించాలని, ఎవరూ తప్పుబట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్‌ సూచించారు. చెరువుల పరిరక్షణతో సంబంధమున్న అన్ని విభాగాల మధ్య సమన్వయం ముఖ్యమన్నారు. చెరువులకు అనుసంధానంగా ఉన్న కాలువల పరిరక్షణపైనా లేక్‌ ప్రొటెక్షన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ దృష్టి సారించాలన్నారు. మంగళవారం బుద్దభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్‌ జిల్లాలకు చెందిన ఇరిగేషన్‌, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులతో రంగనాథ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Updated Date - Dec 25 , 2024 | 05:55 AM