ధాన్యం కేటాయింపుల్లో గోల్‌మాల్
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:04 AM
ప్రస్తుత సీజన్‌లో రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయింపుల్లో గోల్ మాల్ చోటుచేసుకుంటోంది.
- సివిల్ సప్లయి శాఖలో ఇష్టారాజ్యం
నిరుడు అరవై శాతం సీఎంఆర్ అప్పగించిన మిల్లులకే కేటాయింపులు
- ప్రస్తుత సీజన్‌లో అరవై శాతం రికవరీపై నిర్లక్ష్యం
ఇప్పటికే మిల్లుల అసోసియేన్‌ల నుంచి సివిల్ సప్లయికి చేరిన జాబితా
ధాన్యం కేటాయింపులో అసోసియేషన్ల సిఫారసే కీలకం
జగిత్యాల, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సీజన్‌లో రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయింపుల్లో గోల్ మాల్ చోటుచేసుకుంటోంది. జగిత్యాల సివిల్ సప్లయి శాఖలో అధికారులు ఇష్టారాజ్యంగా తయారైంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గానుగాడించి ఎఫ్‌సీఐ, సివి ల్ సప్లయి శాఖలకు అప్పగించేందుకు జరిగే మిల్లుల కే టాయింపుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆ రోపణలు వస్తున్నాయి. గత యేడాది రైస్ మిల్లులకు ధా న్యం కేటాయించడానికి 60 శాతం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగింత నిబంధనను కఠినంగా అమలు చేశారు. ప్రస్తుత యేడాది కేటాయింపుల్లో నిబంధనను పక్కన బెట్టడం వ్యవహారంపై విమర్శలు వ్యక్తం అవుతు న్నాయి.
ప్రతీ సీజన్‌లోనూ జాప్యమే..
ప్రతీ సీజన్‌లో సకాలంలో బియ్యం అప్పగించకుండా మిల్లర్లు జాప్యం చేస్తున్నారు. కొందరు మిల్లుల యజమా నులు ధాన్యాన్ని అమ్ముకున్నారన్న ఆరోపణలు సైతం వ చ్చాయి. ఈ క్రమంలో మిల్లులకు కేటాయించిన సీఎం ఆర్ ధాన్యాన్ని ప్రభుత్వం టెండర్ వేసి విక్రయించింది. ధాన్యం అప్పగించడంలో మిల్లర్లు ససేమిరా అనడంతో సివిల్ సప్లయి శాఖ అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ ని ర్వహించి పలువురు మిల్లర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఒకటి, రెండు మిల్లుపై రెవెన్యూ రికవరీ యా క్టు కింద కేసు నమోదు చేయడం, క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుత సీజన్‌లో పది మిల్లులను డిఫా ల్టర్ జాబితాలో చేర్చి ధాన్యం కేటాంపులు జరపడం లే దు. రైస్‌మిల్లర్లు ఏ సీజన్‌లోనూ సకాలంలో సీఎంఆర్ అప్పగించిన దాఖలాలు లేవు. ఈ సీజన్ నుంచి డిఫాల్ట్ అయిన మిల్లుకు ధాన్యం కేటాయించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. మిల్లుల ట్రాక్ రికార్డును బట్టి ధాన్యం అప్పగించాలని, బ్యాంకు గ్యారెంటీల లేకుండా ఇవ్వరాదని ఆదేశించింది.
జిల్లాలో రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. బకాయిలున్న వా రికి కేటాయించొద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా గత యే డాది అమలు చేసిన మాదిరిగా అరవై శాతం ని బంధనను పరిగణలోకి తీసుకోకుండా కేటాయింపుల కు తెరలే పారు. ఇందుకు అనుగుణంగా రైస్ మిల్లుల అ సోసియేషన్ల నుంచి జాబితాలను స్వీకరించారు. జిల్లా లో గల రైస్ మిల్ అసోసియేషన్లు తమ సభ్యులకు కే టాయించిన ధాన్యం వివరాలను అందజేస్తూ జాబితా ను అందజేశారు. సదరు జాబితాలో అసోసియేషన్లు క నీసం పదిశాతం సీఎంఆర్ అప్పగించని మిల్లులకు సై తం సిఫారసు చేయడం, వాటిని ఆమోదించడానికి అధి కారులు రంగం సిద్ధం చేస్తుండడం విమర్శలకు గురిచే స్తోంది. జిల్లా వ్యాప్తంగా 44 రా రైస్ మిల్లులు, 47 ఫారా బాయిల్డ్ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించాలని అసోసియేషన్‌లు లేఖలను సివిల్ సప్లయి శాఖకు అం దాయి. వీటిలో ఓ నాలుగు మిల్లులకు ధాన్యం కేటా యించడంలో అధికారులు పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మిల్లులకు యథా విధిగా ధాన్యం కేటాయింపులు జరుపుతున్నారు.
మరో ఇరవై రోజుల్లో ముగుస్తున్న గడువు..
జిల్లాలో 2023-24 వానాకాలం సీజన్‌కు సంబందించి సీఎంఆర్‌ను రైస్ మిల్లర్లకు అప్పగించడానికి ప్రభుత్వం పొడగించిన గడువు ఈనెలాఖరుతో ముగుస్తోంది. మరో ఇరవై రోజుల్లో సీఎంఆర్ వంద శాతం పూర్తి చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 116 రైస్ మిల్లులకు ధాన్యం కే టాయించగా ఇందులో 65 బాయిల్డ్ మిల్లులకు 19,92, 739 క్వింటాళ్లు, 51 రారైస్ మిల్లులకు 10,80,835 క్వింటా ళ్ల ధాన్యం కేటాయించారు. ఇందులో ఈనెల 4వ తేదీ వ రకు 75 శాతం సీఎంఆర్‌ను అప్పగించగా బాయిల్డ్ మి ల్లులు 84 శాతం, రా రైస్ మిల్లులు 59 శాతం పూర్తి చేసింది. మిగిలిన పాతిక శాతం సీఎంఆర్ ఈనె లా ఖరులోపు అప్పగించాల్సి ఉంది.
నిబంధనల మేరకే...
జితేందర్ రెడ్డి, జిల్లా సివిల్ సప్లయి అధికారి
జిల్లాలో రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపుల విష యంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నాము. 2022-23 సీజన్ వరకు డిఫాల్ట్ అయినా 10 మిల్లులకు ధాన్యం కేటాయించడం లేదు. గత యేడాది అమలు చేసిన 60 శాతం రికవరీ నిబంధన ప్రస్తుతం పాటించ డం లేదు. జిల్లాలో ఇప్పటివరకు 87 ఫారాబాయిల్డ్, రా రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరపడానికి నిర్ణ యించాము. ధాన్యం కేటాయింపుల్లో ఎలాంటి అవకతవ కలు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నాము.