క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం
ABN , Publish Date - Dec 26 , 2024 | 10:58 PM
క్రీడలను, క్రీడాకారులను ప్రో త్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ క ర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి
- క్యాంప క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం
నాగర్‌కర్నూల్ టౌన్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : క్రీడలను, క్రీడాకారులను ప్రో త్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ క ర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో రిలయన్స్ క్యాంప్ క్రికెట్ టోర్న మెంట్ విజేతలకు బహుమతుల ప్రదానోత్స వానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రైజ్ మనీ, షీల్డును అందజేశారు. మూడు రోజల పాటు నిర్వహించిన రిలయన్స్ క్యాంప్ క్రికెట్ టోర్నమెంట్‌లో నాగర్‌కర్నూల్ నియోజవర్గం నుంచి మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. ఫైన ల్స్‌లో నాగర్‌కర్నూల్ జట్టు తెల్కపల్లి జట్టుపై విజయం సాధించి రూ.20 వేల ప్రైజ్ మనీతో పాటు షీల్డును ఎమ్మెల్యే చేతుల మీదుగా అం దుకున్నారు. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన తెల్కపల్లి జట్టుకు రూ.10 వేల ప్రైజ్ మనీతో పాటు షీల్డును అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, కౌన్సి లర్లు ఎండీ.నిజాముద్దీన్, శ్రీనివాసులు, జక్కా రాజు, కాంగ్రెస్ నాయకులు కొండ నాగేష్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలి
రైతాంగానికి ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వ్యవసాయ పనిముట్లను రైతులు సద్వినియో గం చేసుకోవాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా క్టర్ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వ ర్యంలో నాగర్‌కర్నూల్ మండలంలోని పలు గ్రామాల రైతులకు మంజూరు చేసిన సబ్సిడీ స్ర్పింక్లర్లను ఎమ్మెల్యే అందజేశారు. త్వరలో రైతు భరోసాను అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ
కందనూలు : వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెం దిన ఆలేరు గ్రామానికి చెందిన రాముల మ్మ మృతదేహాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీ లించారు. వివరాలను కుటుంబ సభ్యులను అ డిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే అన్నా రు. ఆసుపత్రిలో చేర్చిన సకాలంలో వైద్యం అం దించకపోవడం వల్లే భార్య మృతి చెందిందని మృతురాలి భర్త ఎమ్మెల్యే దృష్టికి తీసుకురా వడంతో ఇలాంటి సంఘటనలు నియోజక వర్గంలో పునరావృతం కాకుండా చర్యలు తీసు కుంటానని హామీ ఇచ్చారు.