Share News

Ponnam Prabhakar: ‘ఈవీ’లపై రాయితీలు ప్రజలకు తెలియాలి

ABN , Publish Date - Nov 24 , 2024 | 04:58 AM

కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈవీ(ఎలక్ట్రిక్‌ వాహనాలు)ల రిజిస్ట్రేషన్‌లో ప్రభుత్వం రాయితీలు ఇస్తున్న విషయం ప్రజలకు చేరువవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించింది.

Ponnam Prabhakar: ‘ఈవీ’లపై రాయితీలు ప్రజలకు తెలియాలి

  • వాహన షోరూమ్‌ల వద్ద బోర్డులు పెట్టించండి: పొన్నం

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈవీ(ఎలక్ట్రిక్‌ వాహనాలు)ల రిజిస్ట్రేషన్‌లో ప్రభుత్వం రాయితీలు ఇస్తున్న విషయం ప్రజలకు చేరువవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించింది. ఈ రాయితీలపై వాహన షోరూమ్‌ల వద్ద ఆయా సంస్థలు బోర్డులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు రవాణా శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించిన ఆయన కీలక సూచనలు చేశారు. అలాగే, ‘మహాలక్ష్మీ’ పథకం అమలుతో ఆర్టీసీ లాభాల బాట పట్టిందని టీజీఆర్టీసీ అధికారులతో నిర్వహించిన మరో సమీక్షలో మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 04:58 AM