వసతిగృహాలను విస్మరించిన ప్రభుత్వం
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:53 AM
వసతిగృహాలను విస్మరించిన ప్రభుత్వం విద్యా ర్థుల సంక్షేమంను గాలి కొదిలివేయడంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బీఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో చేపట్టిన గురుకులాల బా ట కార్యక్రమంలో బాగంగా విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి మండలంలోని తాటి పల్లి బాలికల గరుకుల పాఠశాల, కళాశాల వసతిగృహాన్ని సందర్శించారు.
మల్యాల, డిశంబరు 2(ఆంధ్రజ్యోతి): వసతిగృహాలను విస్మరించిన ప్రభుత్వం విద్యా ర్థుల సంక్షేమంను గాలి కొదిలివేయడంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బీఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో చేపట్టిన గురుకులాల బా ట కార్యక్రమంలో బాగంగా విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి మండలంలోని తాటి పల్లి బాలికల గరుకుల పాఠశాల, కళాశాల వసతిగృహాన్ని సందర్శించారు. ఈ సందర్భం గా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి మధ్యాహ్నభోజనం చేశారు.
ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో గురుకు లాలు వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు, మౌలిక వసతులు, నాణ్యమైన బోజనం, కాస్మొటిక్స్ తదిత రవి అందించామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాదిలో వాటిని అందిం చడం లేదని హాస్టళ్లపై పర్యవేక్షణ లేక నాసిరకం భోజనంతో విద్యా ర్థులు అస్వస్థ తకు గురవుతున్నారని ఆరోపించారు. తాటిపల్లి గురుకులంలో విద్యార్థులకోసం గతంలో తాము ఏర్పాటు చేసిన సోలార్‌హీటర్ ప్రస్తుతం పని చేయకపోవడంతో చల్లటి నీరుతో స్నానాలు చేస్తున్నారని తెలిసిందన్నారు. ప్రభుత్వం హాస్టళ్లలో సమస్యలు వెంటనే పరిష్క రించాలని, ఎమ్మెల్యేలు, మంత్రులు హాస్టళ్లను సందర్శించేలా ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతారం విండో చైర్మన్ అయిల్నేని సాగర్ రావు, మాజీ ఎంపీపీ శ్రీలత, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, ఎం.డీ.అజర్, రవివర్మ, చిన్నదుర్గయ్య పాల్గొన్నారు.