సర్కారు కొలువే లక్ష్యంగా..
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:59 AM
విద్యార్థులు సర్కారు కొలువు కొట్టాలనే పట్టుదలతో రాత్రింబవళ్లు క ష్టపడి చదువుతున్నారు. జిల్లా గ్రంథాలయంతో పాటు ప్రైవేట్, ఆన్‌లైన్ కోచింగ్ సెంటర్ల ద్వారా పరీక్షకు సన్న ద్ధమవుతున్నారు. ఏళ్ల తరబడి ప్రిపరేషన్‌కే పరిమిత మైన యువత..ఇటీవల డీఎస్సీతో కొంత ఉపశమనం పొందగా...వరుస నోటిఫికేషన్లతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు
గ్రూప్-3, టెట్, డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న నిరు ద్యోగులు
గ్రంథాలయాలు, కోచింగ్ సెంటర్లలోనూ కిటకిట
- ఈనెల 17,18వ తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు
ఆన్‌లైన్‌లో విడుదల అయిన హాల్ టిక్కెట్లు
- జిల్లాలో పోటీ పడుతున్న సుమారు 30 వేల మంది
- ఈనెల 20వ తేదీ వరకు టెట్ దరఖాస్తులు
జగిత్యాల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సర్కారు కొలువు కొట్టాలనే పట్టుదలతో రాత్రింబవళ్లు క ష్టపడి చదువుతున్నారు. జిల్లా గ్రంథాలయంతో పాటు ప్రైవేట్, ఆన్‌లైన్ కోచింగ్ సెంటర్ల ద్వారా పరీక్షకు సన్న ద్ధమవుతున్నారు. ఏళ్ల తరబడి ప్రిపరేషన్‌కే పరిమిత మైన యువత..ఇటీవల డీఎస్సీతో కొంత ఉపశమనం పొందగా...వరుస నోటిఫికేషన్లతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. గ్రూప్-3 పరీక్షకు అధికార యంత్రాంగం కస రత్తు చేస్తోంది. పరీక్షను పకడ్భందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరో వైపు టెట్ నిర్వహ ణకు దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. నీట్ పరీ క్షకు సైతం పలువురు యువతీ యువకులు సన్నద్దమవు తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల మంది నిరుద్యోగులు కొలువలను సాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు.
రెండు రోజుల పాటు గ్రూప్-3 పరీక్షలు....
జిల్లాలో గ్రూప్-3 పరీక్ష ఈ నెల 17, 18వ తేదీల్లో రెండు రోజుల పాటు జరుగనుంది. నవంబర్ 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో హాల్ టికెట్స్ విడుదల చేశారు. ఈ నోటిఫి కేషన్ ద్వారా మొత్తంగా 1,388 గ్రూప్-3 పోస్టు లను భర్తీ చేయనుండగా, ఇందులో అదనంగా 14 పోస్టు లను పెంచింది. వీటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా నుంచి సుమారు 10,656 మంది పరీక్షకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 34 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. 17వ తేదీన రెండు 18న ఒక పేపర్ మూడు పరీక్షలకు గాను ఒక్కో పేపర్ కు 150 చొప్పున 450 మార్కులకు విద్యార్థి మూడు ప రీక్షలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో పరీక్షకు రెండున్నర గంటల సమయం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన సిల బస్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిం ది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్య ర్థులు ఇంటర్వ్యూ లేకుండా, కేవలం మార్కులను ఆధారంగా సర్కారు కొలువు కొట్టనున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి గ్రూ ప్-3 పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రూప్-3 పరీక్షలో ముఖ్యంగా ఎకానమీ పేపర్, కరెంట్ అఫైర్స్ అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రధానమైన అంశాలకు సం బంధించి సిలబస్ ప్రకారం రివైజ్ చేయాలని, ము ఖ్యం గా పాలిటిక్స్, ఎకానమీ, చరిత్ర, జనరల్ సైన్స్ వంటి అంశాలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నా రు. గత పేపర్లను, మోడల్స్‌ను పరిశీలించాలని, ఇవి ప్ర శ్నల శైలి, ముఖ్యమైన అంశాలపై క్లారిటీ ఇస్తాయని, ముఖ్యమైన పాయింట్స్, డేట్స్, పేర్ల గురించి చిన్న నోట్స్ రాసుకోవాలని అంటున్నారు.
ఇటీవల డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు భరో సా కల్పించిన సర్కారు జాబ్ క్యాలెండర్‌ను అనుసరిస్తూ మరోసారి టీచర్ ఎలిజి బిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ద్వారా ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగులు మళ్లీ ప్రిపరేసన్ షు రూ చేశారు. ఈ ఏడాది మే నుంచి 20వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు టెట్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం, ఇచ్చిన మాట ప్రకారం రెండోసారి ని ర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 20వ తేదీ వరకు టెట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 తేదీ నుంచి 20 వరకు టెట్ పరీక్షల ను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
జిల్లాలో 30 వేల మంది నిరుద్యోగులు
జిల్లాలో పీఎస్, గౌట్ హెచ్‌ఎం, ల్యాంగ్వేజ్ పండిట్, సీనియర్ అసిస్టెంట్ (ఆయా కేటగిరీలు), ఎస్టీటీ తదితర వాటికి సంబంధించి పలు ఉపాధ్యాయ ఖా ళీలు ఉన్నాయి. జిల్లా నుంచి 25 వేల నుంచి 30 వేల మంది వరకు నిరుద్యోగులు టెట్ రాసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. టెట్ పేపర్-1 డీఈడీ, పేపర్-2 కు బీఈ డీ చేసిన అభ్యర్థులు అర్హులు. ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయులు స్కూల్ అ సిస్టెంట్‌గా పదోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి కావడంతో వందలాది మం ది ఉపాధ్యా యులు పరీక్షకు సిద్ధమవుతున్నాయి. టెట్ విధానం అమలులోకి వ చ్చిన నాటి నుంచి 9 సార్లు ఎంట్రెన్స్ టెస్ట్‌లు జరుగగా, వచ్చే ఏడాది జనవరిలో 10వ సారి జరుగబోతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరుసార్లు టెట్ ప రీక్షలు జరిగాయి. ఇప్పుడు జరగబోయే టెట్‌పై నోటిఫికేషన్ రావడంతోనే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిరుద్యోగులకు ఫోన్లు చేసి కోచింగ్ సెంటర్‌లో చేరాలని కోరుతున్నారు.
నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాను..
మూగల మౌని శ్రీ, యువతి, జగిత్యాల
నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నాను. ఎలాం టి డిస్టపెన్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో లైబ్రరీ ఉండడం సన్నద్ధమవుతున్నాను. పరీక్షకు అవసరమైన పలు పు స్తకాలు అందుబా టులో ఉన్నాయి. అనుమానాలు వస్తే ఒకరి కొకరం తీర్చుకుంటున్నాము.
ఒత్తిడి లేకుండా సన్నద్ధం కావాలి
డాక్టర్ సాకేత్ రెడ్డి, ప్రభుత్వ మానసిక వైద్య నిపుణులు, జగిత్యాల
పోటీ పరీక్షలకు హాజరయ్యే యువతీ యువకులు మానసి క ఒత్తిడికి గురికావద్దు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రిపేర్ కావాలి. పరీక్షకు అవసరమైన మెటీరియల్స్‌ను అందుబాటు లో ఉంచుకోవాలి. అనుమానాలు వస్తే నిపుణులను సంప్ర దించి నివృత్తి చేసుకోవాలి. ఏకాగ్రత, నిరంతర శ్రమ, క్రమశి క్షణ, సమయ పాలన పాటిస్తే లక్ష్యం సాధించవచ్చును.
ఎల్‌వోసీ అందజేసిన ఎమ్మెల్యే
సారంగాపూర్, నవంబరు, 13 (ఆంద్రజ్యోతి) మండలంలోని బట్టపెల్లి గ్రా మానికి చెందిన కల్లెపెల్లి రమాదేవి వెన్నుముక సంబంధిత సమస్యతో బాధపడు తుంటంతో స్థానిక నాయకులు సమస్యను ఎమ్మెల్యే డాక్టరు సంజయ్‌కుమార్ దృ ష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం రూ, 2.50 వేల ఎల్‌వోసిని కుటుంబ సబ్యులకు అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.