600 వైద్య పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Oct 02 , 2024 | 06:14 AM
బీమా వైద్య సేవల విభాగంలోని(ఈఎ్‌సఐ) ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 600 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ముఖ్య
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): బీమా వైద్య సేవల విభాగంలోని(ఈఎ్‌సఐ) ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 600 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆరు వందల పోస్టుల్లో వైద్యులు, స్టాఫ్‌నర్స్‌ల పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. ఈ పోస్టులను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని జీవోలో సర్కారు పేర్కొంది. కాగా ఒక్క సెప్టెంబరులోనే మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు సుమారు 4 వేల పోస్టుల(ల్యాబ్ టెక్నీషియన్స్, స్టాఫ్‌నర్స్, ఫార్మసిస్టు)కు నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా మరో 600 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం తెలపడంతో పోస్టుల సంఖ్య పెరగనుంది.