Share News

Harish Rao: 6 గ్యారంటీల అమలులో రేవంత్‌ డకౌట్‌

ABN , Publish Date - Nov 19 , 2024 | 02:18 AM

ఆరు గ్యారంటీల అమలులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డకౌట్‌ అయ్యారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో నిర్వహించిన క్రికెట్‌ ట్రోఫిలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు.

Harish Rao: 6 గ్యారంటీల అమలులో రేవంత్‌ డకౌట్‌

  • మాజీ మంత్రి హరీశ్‌రావు

హయత్‌నగర్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీల అమలులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డకౌట్‌ అయ్యారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో నిర్వహించిన క్రికెట్‌ ట్రోఫిలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పది సంవత్సరాలలో కేసీఆర్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపితే ఒకే సంవత్సరంలో కాంగ్రెస్‌ వెనక్కు తీసుకుపోయిందని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీల దుకాణాన్ని బందు పెట్టి మూసీ సుందరీకరణ ముందు వేసుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌ హాయాంలో మూసీ నది అభివృద్ధి కోసం రూ. 3,800 కోట్లతో 31 మురుగుశుద్ధి కేంద్రా(ఎ్‌సటీపీ)లు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. పేదల ఇళ్లు కూల్చి ముఖ్యమంత్రి హిట్‌ వికెట్‌ అయ్యాడని ఎద్దేవా చేశారు.

Updated Date - Nov 19 , 2024 | 02:18 AM