Harish rao: కానిస్టేబుళ్ల లీవ్‌మాన్యువల్ మార్చడం దుర్మార్గం
ABN , Publish Date - Oct 16 , 2024 | 04:19 AM
నిబంధనలు మార్చుతూ పోలీసు సోదరుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. టీఎ్‌సఎస్పీ కానిస్టేబుళ్లు 15 రోజులకోసారికి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్‌మాన్యువల్ మార్చడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.
వారికి రేవంత్ దసరా కానుక ఇదేనా?
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): నిబంధనలు మార్చుతూ పోలీసు సోదరుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. టీఎ్‌సఎస్పీ కానిస్టేబుళ్లు 15 రోజులకోసారికి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్‌మాన్యువల్ మార్చడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఇది వారాల పాటు కుటుంబాలకు వారికి దూరం చేయడమేనా? అని మంగళవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన దసరా, దీపావళి కానుక ఇదేనా? అని నిలదీశారు. టీఎ్‌సఎస్పీ కానిస్టేబుళ్లకు నెలకొకసారి లీవు విధానం అమలు చేయకుండా, ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సివిల్, ఏఆర్ ఇతర విభాగాల పోలీసులకు 15 రోజుల టీఏ ఇచ్చేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు రోజులకు దాన్ని కుదించిందని అన్నారు. పాతవిధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు, ఇతర నేరాల రేటు గణనీయంగా పెరిగిందని, శాంతిభద్రతలు క్షీణిస్తున్నా ప్రభుత్వానికి కనీస పట్టింపులేదని ఎక్స్ వేదికగా ఆరోపించారు. హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకొనే గచ్చిబౌలిలో యువతిపై అత్యాచారం జరగటంపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు.