HarishRao: ఢిల్లీలో ఎవరున్నా తెలంగాణ గొంతుక వినిపించేది బీఆర్ఎస్సే
ABN , Publish Date - Jan 17 , 2024 | 07:18 PM
ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా తెలంగాణ గొంతుకను వినిపించేది కేవలం బీఆర్ఎస్(BRS) పార్టీ అని మాజీ మంత్రి, సీనియర్ నేత హరీశ్ రావు(HarishRao) అన్నారు. నాగర్ కర్నూల్లో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి అయ్యాక కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు.
నాగర్ కర్నూల్: ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా తెలంగాణ గొంతుకను వినిపించేది కేవలం బీఆర్ఎస్(BRS) పార్టీ అని మాజీ మంత్రి, సీనియర్ నేత హరీశ్ రావు(HarishRao) అన్నారు. నాగర్ కర్నూల్లో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి అయ్యాక కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిస్తేనే హామీలు అమలవుతాయన్నారు. రాష్ట్రానికి ఏది రావాలన్నా బీఆర్ఎస్ ఒత్తిడితోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని.. పార్టీ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు.