ACB Court: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ నేడు
ABN , Publish Date - Feb 12 , 2024 | 09:44 AM
హెచ్ఎండీఏ(HMDA) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దని ఇదివరకే ఏసీబీ.. కోర్టుకు విన్నవించింది. నిందితుడికి ఇప్పటికే 8 రోజుల కస్టడీ పూర్తయింది.
హైదరాబాద్: హెచ్ఎండీఏ(HMDA) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దని ఇదివరకే ఏసీబీ.. కోర్టుకు విన్నవించింది. నిందితుడికి ఇప్పటికే 8 రోజుల కస్టడీ పూర్తయింది.
ఈ క్రమంలో బెయిల్ మంజూరు చెయ్యాలని బాలకృష్ణ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి ఏసీబీ కోర్టు నేడు బెయిల్‌పై తీర్పు వెల్లడించనుంది. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో బాలకృష్ణ రూ.100 కోట్లకు పైగా కూడబెట్టారు. శివ బాలకృష్ణ ఇళ్లు, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీకి విస్తుగొల్పేలా నోట్ల కట్టలు దొరికాయి. రూ.100 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.