Share News

నక్షలేక నరకం!

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:37 PM

దేశానికి వెన్నెముకగా చెప్పే రైతులకు భూ సమస్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి తరాలు మారినా తలరాతలు మారకపోవడంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా తమ సమస్య ఎవరికి పట్టకపోవడంతో పరేషాన్‌ అవుతున్నారు.

నక్షలేక నరకం!

తలనొప్పిగా మారిన లక్ష్మాపూర్‌ రైతుల భూ సమస్య

ఏళ్ల్లు గడుస్తున్నా పరిష్కారం కానీ వైనం

ప్రభుత్వ పథకాలకు నోచక ఆవేదన

ప్రభుత్వాలు మారినా పరిష్కారం శూన్యం

రీ సర్వే గ్రామస్తుల పాలిట పాపమా?

ఇదే అదనుగా రెచ్చిపోతున్న అక్రమార్కులు

అధికారుల అండదండలతో చేతులు మారుతున్న లావణి, పట్టా భూములు

దేశానికి వెన్నెముకగా చెప్పే రైతులకు భూ సమస్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి తరాలు మారినా తలరాతలు మారకపోవడంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా తమ సమస్య ఎవరికి పట్టకపోవడంతో పరేషాన్‌ అవుతున్నారు. ఇది ఎక్కడో కాదు.. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత మండలం, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదటి గర్జన గడ్డ అయిన మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌ గ్రామ సమస్య . రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా ఈ గ్రామానికి నిర్దిష్టమైన గ్రామ నక్ష లేకపోవడం, సరైన భూ రికార్డులు లేకపోవడం ఆ గ్రామ రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎదురుచూస్తున్న రైతులకు ఏళ్ల్ల నాటి శని వదలడం లేదు.

మూడుచింతలపల్లి, జూలై 26: తరతరాలుగా తాతలు, ముత్తాతలు వారసత్వంగా ఇచ్చిన ఆస్తులు తమకు ఏ విధంగా ఉపయోగపడడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. సరైన రికార్డులు లేని కారణంగా తమ భూమి ఎక్క డ ఉందో.. ఎంత ఉందో అంతుచిక్కక అయోమయానికి గురవుతున్నారు. తరాలు మారినా ప్రభుత్వాలు మారినా తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని విసిగెత్తిపోతున్నారు. స్వయాన రాష్ట్ర సీఎంమే దిగివచ్చినా తమ భూ సమస్యలు పరిష్కారం లభించడం లేదంటూ ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌ గ్రామరెవెన్యూ వ్యవస్థ ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా వారి భూ సమస్య మాత్రం ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్న చం దంగా ఉంది. సరైన భూరికార్డులు(నక్ష) లేకపోవడంతో తమకున్న భూమి ఎక్కడ ఉందో ఎంత ఉందో రైతులకు తెలియని పరిస్థితి నెలకొంది. వ్యవసాయమే జీవనాధారం గా ఉన్న ఆగ్రామ రైతాంగానికి జీవితమే అంధకారంగా మారింది. తమకు ఉన్న పొలంలో సాగు చేసుకుందామన్న రైతన్నకు అప్పులు దొరకకపోవడం ఒకటైతే, ఆ భూమిని అమ్ముకుందామనుకున్నా వీలులేని పరిస్థితి మరొకటి. లోన్ల (అప్పు) కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా, అమ్ముకుందామని కార్యాలయాల చుట్టూ తిరిగినా తిప్పలు తప్పడం లే దు. సరైన భూరికార్డు లేదనే వంకతో అన్నిదారులు మూసుకుపోతున్నాయి. చేసేదేమి లేక చెప్పుకోవడానికి ఎవ్వరూలేక లక్ష్మాపూర్‌ రైతులు ఆందోళన చెందుతున్నారు.

మారని తలరాతలు

లక్ష్మాపూర్‌ గ్రామంలో భూసమస్య రైతుల పాలిట శాపంగా మారింది. స్వయాన ముఖ్యమంత్రులే దిగి వచ్చినా భూసమస్యకు పరిష్కారం మాత్రం చూపలేకపోతున్నారు. 2017లో అప్పటి సీఎం కేసీఆర్‌ లక్ష్మాపూర్‌ గ్రామాన్ని సందర్శించడంతో ఆ ప్రజలు స్వయాన దేవుడే దిగివచ్చాడని భావించారు. సభలు పెట్టి సమస్యను పరిష్కారిస్తానని చెప్పడంతో తమ భవిష్యత్తు బంగారంగా మరుతుందని సంబరపడ్డ రైతుల ఆశలు ఆవిరవ్వడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ధరణితో తమ జీవితాలకు దారి దొరుకుతుందని అనుకుంటే ఇప్పుడు ఆ ధరణియే శాపమై పీడిస్తోంది. అప్పుడే నేనున్నా... అంటూ పలకరించిన నాటి ఎంపీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఎక్కడి సమస్య అక్కడే ఆగిపోయింది. కనీసం రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ సమస్య తీరుతుందంటే అతీగతీ లేకుండా పోయింది. లక్ష్మాపూర్‌ గ్రామ రైతులు కనీసం రుణమాఫీకి నోచుకోవడం లేదు. ఈ గ్రామ భూ సమస్యలపై ఇప్పటికైనా సీఎం చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని రైతులు వేడుకుంటున్నారు.

తారుమారు..

పట్టా భూములను లావణి (అసైన్డ్‌) పట్టాలుగా, లావణి భూములు పట్టా భూములుగా మారిపోయాయి. అంతే కాకుండా అటవీ శాఖ భూములు కొంత అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. దీంతో అక్రమార్కులు, భూ కబ్జాదారులు ఇదే అదనుగా అక్రమణలకు పాల్పడుతున్నారు. పెద్దఎత్తున ప్రభుత్వ, అటవీ, లావణి భూములు చేతులు మారుతున్నాయి. రీ సర్వేతో కొంత మందికి భూమి ఉన్నదాని కంటే ఎక్కువగా రాగా, మరికొంత మందికి తక్కువగా వచ్చింది. పాత రికార్డుల ప్రకారం ఉన్న సర్వే నంబర్లు, కొత్తగా చేసిన సర్వేతో భూ సర్వే నంబర్లు మారడంతో గందరగోళం నెలకొంది. ఇదే అదనుగా భూ బకాసురులు,గ్రామస్తులు అధికారులను కలుపుకుని అటు ప్రభుత్వ, లావణి పట్టా భూములకు ఎసరు పెట్టారు. ఈ క్రమంలో అందినకాడికి దండుకుంటున్నారు. రీ సర్వేతో పాటు కొత్త రికార్డుల కారణంగా బ్యాంక్‌లోన్‌, భూ తగాదాలు ఎక్కువయ్యాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల మానస పుత్రిక అయిన లక్ష్మాపూర్‌ గ్రామానికి చెందిన రైతులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదు. రీ సర్వేతో పట్టాదారు పాస్‌పుస్తకాలు రాక, పట్టా భూములు లావణి పట్టాలుగా మారడంతో పాటు సర్వే నంబర్లు మారి రైతులు ఆయోమయంలో పడ్డారు. అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన రైతుబంధు, రైతుబీమాతో పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన రైతు రుణమాఫీ పథకాలకు లక్ష్మాపూర్‌ గ్రామస్తులు నోచుకోవడం లేదు. సాక్ష్యాతూ సీఎంలే సమస్యను పరిష్కరించకపోతే ఇంకేవరికి మొర పెట్టుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రీ సర్వే శాపమా...

లక్ష్మాపూర్‌ గ్రామాన్ని ఆగస్టు 2017 లో అప్పటి ముఖ్యంత్రి కేసీఆర్‌ సందర్శించి సర్వే చేసి గ్రామ రూపురేఖలను మారుస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. చెప్పిందే తడువుగా రెవెన్యూ సర్వే తదితర శాఖల అధికారులు ఉరుకులు పరుగులు పెడుతూ సర్వే నిర్వహించారు. అయితే అసలు సమస్య అక్కడే మొదలైంది. అప్పటి వరకు ఎవరి భూములు, ఎవరి రికార్డులు వారికి ఉండగా రీసర్వే కొత్త తంటాలను తెచ్చి పెట్టింది. లక్ష్మాపూర్‌ గ్రామంలో మొత్తం 3,250 ఎకరాల భూమి ఉంది. అందులో పట్టా భూములు, సుమారు 300 ఎకరాల పైచిలుకు లావాణి (అసైన్డ్‌భూములు) పట్టా, ప్రభుత్వ భూమి, 1100ఎకరాలపైగా అటవీ భూములున్నాయి. సర్వే అనంతరం అధికారుల తప్పిదంతో కొత్తగా చేసిన రికార్డులతో గందరగోళం మొదలైంది.

తారుమారు..

పట్టా భూములను లావాణి (అసైన్డ్‌) పట్టాలుగా, లావాణి భూములు పట్టా భూములుగా మారిపోయాయి అంతేకాకుండా అటవీశాఖ భూములు కొంత అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. దీంతో అక్రమార్కులు, భూ కబ్జాదారులు ఇదే అదనుగా కబ్జాలకు పాల్పడుతున్నారు. పెద్దఎత్తున ప్రభుత్వ, అటవీ, లావాణి భూములు చేతులు మారుతున్నాయి. రీ సర్వేతో కొంత మందికి భూమి ఉన్నదానికంటే ఎక్కువగా రాగా, మరికొంత మందికి తక్కువగా వచ్చింది. పాత రికార్డుల ప్రకారం ఉన్న సర్వే నంబర్లు, కొత్తగా చేసిన సర్వేతో భూ సర్వే నంబర్లు మారడంతో గందరగోళం నెలకొంది. ఇదే అదనుగా భూ బకాసురులు, గ్రామస్తులు అధికారులను కలుపుకొని అటు ప్రభుత్వ, లావాణి పట్టా భూములకు ఎసరు పెట్టారు. ఈ క్రమంలో అందినకాడికి దండుకుంటున్నారు.

రీ సర్వేతో పాటు కొత్త రికార్డుల కారణంగా బ్యాంక్‌లోన్‌, భూ తగాదాసమస్యలు ఎక్కువయ్యాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల మానస పుత్రిక అయిన లక్ష్మాపూర్‌ గ్రామానికి చెందిన రైతులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదు. రీ సర్వేతో పట్టాదారు పాస్‌పుస్తకాలు రాక, పట్టా భూములు లావాణి పట్టాలుగా మారడంతో పాటు సర్వే నంబర్లు మారి రైతులు ఆయోమయంలో పడ్డారు. అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన రైతుబంధు, రైతుబీమాతో పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన రైతురుణమాఫీ పథకాలకు లక్ష్మాపూర్‌ గ్రామస్తులు నోచుకోవడం లేదు. సాక్ష్యాతూ సీఎంలే సమస్యను పరిష్కరించకపోతే ఇంకేవరికి మొర పెట్టుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు.

త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం

లక్ష్మాపూర్‌ గ్రామ రెవెన్యూ పరిధిలో భూ సమస్యలకు సంబంధించి ప్రస్తుతం 72 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. అర్హులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందజేస్తాం.

- వెంకటనర్సింహారెడ్డి, తహసీల్దార్‌. మూడుచింతలపల్లి

సంక్షేమ పథకాలు అందడం లేదు

లక్ష్మాపూర్‌లో 6.20 ఎకరాల భూమి ఉంది అందులో 3 ఎకరాలకు మాత్రమే పట్టాదారు పుస్తకాలు వచ్చాయి. మిగిలిన మూడు ఎకరాలకు పాస్‌బుక్‌ రాలేదు. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందడం లేదు.

అప్పాల మల్లేషం, రైతు, లక్ష్మాపురం

పాస్‌బుక్‌ రాలేదు

నాకు నాలుగు ఎకరాల లావాణి పట్టా భూమి ఉంది. అందులో నేను సాగు చేసుకుంటున్నాను. నాకు ఇప్పటి వరకూ పట్టాదారు పాస్‌బుక్‌ రాలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కరించడం లేదు.

బందెల మల్లయ్య, రైతు, లక్ష్మాపురం

51మందికి రుణమాఫీ

పట్టాదారు పాస్‌ పుస్తకాలు లేని కారణంగా సంక్షేమ పథకాలకు అర్హులు కాలేదు. లక్ష్మాపూర్‌ గ్రామంలో రైతురుణ మాఫీ కింద ఇప్పటి వరకు 51 మంది లబ్ధిపొందారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుంది.

కృష్ణవేణి, వ్యవసాయశాఖ అధికారి, మూడుచింతలపల్లి

Updated Date - Jul 26 , 2024 | 11:37 PM