రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్
ABN , Publish Date - Dec 25 , 2024 | 04:50 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్‌రావుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్‌రావుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన మామ అంత్యక్రియల్లో పాల్గొనేందుకుగాను ఈ నెల 25న ఉదయం 10 నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చింది. కుటుంబ సభ్యులను, సమీప బంధువులను కలవడానికి రాధాకిషన్‌రావును అనుమతించాలని, అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు ఎస్కార్ట్ సిబ్బంది ఆటంకాలు కలిగించకూడదని మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జస్టిస్ కె.సుజన ధర్మాసనం.. మంగళవారం ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.