Share News

లాభాలు ఉండవని.. శునకాలను నగరం నుంచి తరలించరా?

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:47 AM

‘‘చిన్నారులు, వృద్ధులపై క్రూరంగా దాడి చేస్తున్న శునకాలను హైదరాబాద్‌ నుంచి బయటకు తరలించరా? అలా తరలించడం లాభదాయకం కాదంటే

లాభాలు ఉండవని.. శునకాలను నగరం నుంచి తరలించరా?

లాభాల కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయా?: హైకోర్టు

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘‘చిన్నారులు, వృద్ధులపై క్రూరంగా దాడి చేస్తున్న శునకాలను హైదరాబాద్‌ నుంచి బయటకు తరలించరా? అలా తరలించడం లాభదాయకం కాదంటే ఎలా? ప్రభుత్వాలు లాభాల కోసం పనిచేయవుకదా?’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. హైదరాబాద్‌ నగరంలో శునకాల ఆగడాలకు కళ్లెం వేయడానికి.. నగరం బయట షెల్టర్లు ఏర్పాటు చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. శునకాల దాడి అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రీనివాసరావు ధర్మాసనం మంగళవారం మరోమారు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలను వినిపిస్తూ.. హైదరాబాద్‌ వెలుపల షెల్టర్ల ఏర్పాటు సాధ్యం కాదని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘సాధ్యం కాదంటే ఎలా? కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసినా.. శునకాల దాడులు కొనసాగుతున్నాయి. దీనికి ఏదో ఒక పరిష్కారం ఉండాలి కదా? నిపుణులతో మాట్లాడి.. పరిష్కారాలతో రావాలనే మా ఆదేశాలపై మీరు శ్రద్ధ వహించడం లేదు’’ అని వ్యాఖ్యానించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - Nov 20 , 2024 | 04:47 AM