పట్టుసాగుతో రైతులకు అధిక లాభాలు
ABN , Publish Date - Jan 19 , 2024 | 12:38 AM
పట్టు పురుగుల సాగుతో రైతు లు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన వీరకుమార్ అన్నారు.
గరిడేపల్లి,జనవరి 18:పట్టు పురుగుల సాగుతో రైతు లు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన వీరకుమార్ అన్నారు. గురువారం మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో సెరికల్చర్‌పై రైతులకు ని ర్వహిస్తున్న శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంట సాగు చేయడానిక మల్బరీ ఎంతో అనుకూలంగా ఉంటుందని, అదేవిధంగా అధిక ఆదాయం పొం దవచ్చన్నారు. దేశంలో 36వేల మెట్రిక్ టన్నుల పట్టు ఉత్పత్తి అవుతుండగా డిమాండ్ మాత్రం 60 వేల మెట్రిక్ టన్నులు ఉందన్నారు.జిల్లాలోని పట్టు పంటసాగు చేస్తు న్న రైతులకు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా సహకారం అందిస్తున్నామని తెలిపారు. పట్టు ఉత్పత్తి, మార్కెటింగ్‌అంశాలతో పాటు పట్టు సాగుపై కేవీకే ద్వారా శిక్షణ, అవగాహన కల్పించడం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. పట్టు సాగులో మెళకువల గురించి వివరించారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం ఇనచార్జి శాస్త్రవేత్త డీ నరేష్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వినోద్‌యాదవ్, టీ మాధురి, ఏ కిరణ్, డీ ఆదర్శ్, ఎన సుగంధి, రైతులు పాల్గొన్నారు.