Share News

అంతర్‌ పంటల సాగుతో అధిక లాభాలు: కలెక్టర్‌

ABN , Publish Date - Jan 10 , 2024 | 11:57 PM

ఆయిల్‌పాం క్షేత్రంలో అంతర్‌పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు అన్నారు.

అంతర్‌ పంటల సాగుతో అధిక లాభాలు: కలెక్టర్‌
అంతర్‌పంటగా మిరప సాగును పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకటరావు

చివ్వెంల, జనవరి 10 : ఆయిల్‌పాం క్షేత్రంలో అంతర్‌పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని గుంపుల, తిరుమలగిరి గ్రామాల్లో ఆయిల్‌పాం తోటలను పరిశీలించి, మాట్లాడారు. అంతర పంటలుగా మిర్చి వేసిన రైతును అభినందించారు. ఆయిల్‌ పాం సాగు చేసిన నాల్గో సంవత్సరంలో దిగుబడి వస్తుందని సుమారు 30 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందన్నారు. సాగుచేసిన నాలుగు ఏళ్ల వరకు మిర్చి, కూరగాయలు, వేరుశనగ, కంది, అరటి, బొప్పాయి వంటి పంటలను సాగుచేసి అధిక లాభాలు పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి శ్రీధర్‌, యాదగిరి, జగన, హరీష్‌, రాఘవరెడ్డి, దుబ్బాక ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 11:57 PM