Share News

Telangana: ఘనంగా మహంకాళి బోనాల పండుగ.. భారీగా తరలివస్తున్న భక్తులు..

ABN , Publish Date - Jul 21 , 2024 | 01:04 PM

సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు.

Telangana: ఘనంగా మహంకాళి బోనాల పండుగ.. భారీగా తరలివస్తున్న భక్తులు..
Bonala Festival

సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదమంత్రోచ్ఛరణల నడుమ ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మహాకాళి అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుపుకునే పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో వందల ఏళ్లుగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఎవరు ఏ రంగంలో ఉన్నా.. ఎంత స్థాయిలో ఉన్నా దేవతలను పూజించే విధానాలు ఒకేలా ఉంటాయన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని మంత్రి తెలిపారు. భక్తుల సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని అధికారులను సీతక్క ఆదేశించారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్.. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టువస్త్రాలతోపాటు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. బోనాల జాతర సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొన్నది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ప్రతి రూపాయీ రాబట్టండి


అమ్మవారి దర్శనంలో హర్యానా గవర్నర్

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు గవర్నర్‌కు స్వాగతం పలికారు.

రాష్ట్రపతి పాలనకు పార్లమెంటులో నినదించండి


అమ్మవారి దర్శనంలో సీఎస్

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె బోనం ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.


భారీ బందోబస్తు..

సికింద్రాబాద్ ఉజ్జయిని ఉజ్జయిని మహంకాళి బోనాలకు భారీ భద్రత ఏర్పాటుచేశామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎప్పటిలాగానే బోనాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయని తెలిపారు. బోనాలకు అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేశామన్నారు. పోలీస్ శాఖ నుండి 1500 మంది బందోబస్తులో విధుల్లో ఉన్నట్లు తెలిపారు. మహిళల భద్రత దృష్ట్యా షి టీమ్స్‌ను ఏర్పాటుచేశామన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో బోనాలు కొనసాగుతున్నాయన్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని సీపీ తెలిపారు.


నష్టపరిహారం ఇప్పిస్తా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 21 , 2024 | 01:04 PM