Share News

HYDRA: కూల్చివేతలపై హైడ్రా రిపోర్ట్.. ఇప్పటివరకు ఎన్నంటే

ABN , Publish Date - Aug 25 , 2024 | 03:02 PM

భాగ్యనగరంలో జలవనరులు, ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల చెర నుంచి విడిపించటమే ధ్యేయంగా సాగుతున్న హైడ్రా సంచలనాలకు కేరాఫ్‌గా మారింది.

HYDRA: కూల్చివేతలపై హైడ్రా రిపోర్ట్.. ఇప్పటివరకు ఎన్నంటే

హైదరాబాద్: భాగ్యనగరంలో జలవనరులు, ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల చెర నుంచి విడిపించటమే ధ్యేయంగా సాగుతున్న హైడ్రా సంచలనాలకు కేరాఫ్‌గా మారింది. గత నెల రోజులుగా నగర వ్యాప్తంగా పలు ఆక్రమిత స్థలాల్ని కబ్జాసురుల చెర నుంచి విడిపిస్తున్న హైడ్రా ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై ఆదివారం రిపోర్ట్ రెడీ చేసింది.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటోంది. హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి హైడ్రా శనివారం కూల్చేసింది. అయితే కూల్చివేతలు పూర్తయ్యాక హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా హైడ్రా పేరు మార్మోగిపోయింది.


18 కట్టడాలు..

కాగా.. చెరువులు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. భాగ్యనగరంలో మొత్తంగా18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా తన నివేదికలో స్పష్టం చేసింది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్రెడ్డికి చెందిన నిర్మాణాలు నేలమట్టం చేసినట్లు వివరించింది.

కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమకు చెందిన కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్ట్ లో పేర్కొంది. లోటస్పాండ్, బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజులరామారం, మన్సూరాబాద్, అమీర్పేట్ ఏరియాలలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపింది.

Updated Date - Aug 25 , 2024 | 03:35 PM