Sruthi Chakravarthi: మిసెస్ ఇండియా 2024 ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
ABN , Publish Date - Apr 21 , 2024 | 06:32 PM
హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శృతి చక్రవర్తి రాజస్థాన్, జైపూర్‌లో జరిగిన మిసెస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి అందరినీ అలరించారు. భరత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో ప్రతిభావంతులైన మరో 20 మంది కంటెస్టెంట్స్‌తో పోటీపడిన శృతి చక్రవర్తి.. ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.
హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer) శృతి చక్రవర్తి (Sruthi Chakravarthi).. రాజస్థాన్, జైపూర్‌లో జరిగిన మిసెస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లో ఫస్ట్ రన్నరప్‌గా (Mrs India 2024 Runner Up) నిలిచి అందరినీ అలరించారు. భరత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో ప్రతిభావంతులైన మరో 20 మంది కంటెస్టెంట్స్‌తో పోటీపడిన శృతి చక్రవర్తి.. ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఈ విజయంతో హైదరాబాద్ చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది.
ఈ ప్రయాణంలో ఆమె ప్రదర్శించిన గ్రేస్, ఛార్మ్‌తో ఎందరో హృదయాలను గెలుచుకుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, ఒక గృహిణిగా ఉన్న ఆమె.. ఈ స్థాయికి (రన్నరప్) చేరుకోవడం చూస్తుంటే.. ఇందుకోసం ఆమె తీసుకున్న కఠినమైన శిక్షణ, వస్త్రధారణ సెషన్స్ వంటి వన్నీ ఆమె అంకితభావం మరియు పట్టుదలను తెలియజేస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్‌గా ఈ అందాల పోటీలోకి ప్రవేశించిన శృతి.. ఇందులో తన విద్యా నైపుణ్యం, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుండి అంకితమైన గృహిణి పాత్ర వరకు తన బహుముఖ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. ఆమె అద్భుతమైన ప్రదర్శన భారతీయ మీడియా దృష్టిని ఆకర్షించడమే కాకుండా.. ఈ బ్యూటీ ప్రపంచంలో ఇప్పుడే అడుగు పెట్టిన తారగా ఆమె స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. (Software Engineer Sruthi Chakravarthi)
ఫస్ట్ రన్నరప్.. ఇది కేవలం అవార్డ్ మాత్రమే కాదు.. ఈ అవార్డుతో ఆమె ఇలాంటి ఎందరో మహిళలకు, మహిళా సాధికారతకు చిహ్నంగా మారిందని.. పాషన్, కృషి, సంకల్పం ఉంటే.. అద్భుతాలు సాధించవచ్చని, ఎలాంటి కలనైనా చేరుకోవచ్చనేదానికి శృతి విజయం స్ఫూర్తిగా నిలుస్తోందని.. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.