బునాదిగాని కాల్వ పూర్తిచేయించే బాధ్యత నాదే
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:16 AM
బునాదిగాని(ధర్మారం) కాల్వ పూర్తి చేయించే బాధ్యత తనదేనని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.
మోత్కూరు, సెప్టెంబరు 4: బునాదిగాని(ధర్మారం) కాల్వ పూర్తి చేయించే బాధ్యత తనదేనని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మోత్కూరు మునిసిపాలిటీలో రూ.5.60కోట్లతో నిర్మించ నున్న సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. తుంగతుర్తి ప్రాంత సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు, పలు మార్లు సీఎం రేవంత్‌రెడ్డి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్తుండడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అవుతున్నాయ న్నారు. బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేయడానికి గత నెల 30న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూ.269కోట్లు మంజూరు చేశార న్నారు. మోత్కూరులో ఆర్టీసీ బస్సు డిపో, డిగ్రీ కళాశాల, మోత్కూ రులో తగినంత ప్రభుత్వ భూమి లేకపోవడంతో తిరుమలగిరి తొండలో రూ.2వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. తుం గతుర్తిలో 220ఎకరాల్లో పారిశ్రామిక వాడ(ఇండస్ట్రీయల్ పార్క్) ఏర్పాటుకు, అడ్డగూడూరు, తుంగతుర్తిలో ఐటీఐ ఏర్పాటుకు కృషి చేస్తున్నానన్నారు. మోత్కూరుకు బీసీ బా లుర కళాశాల హాస్టల్ మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యేను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభజస్టీస్, లెక్చరర్లు, మోత్కూరులో సన్మానించారు. తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళా శాల మంజూరు చేయించానని ఎమ్మెల్యే తెలిపారు. మోత్కూరులో యూ టీఎఫ్, రెడ్‌క్రాస్ సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 40మంది రక్తదానం చేశారు. కార్యక్రమాల్లో మునిసిపల్ చైర్‌పర్సన్ గుర్రం కవితలక్ష్మీనర్సింహారెడ్డి, కవిత, వైస్ చైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మిర్యాల దామోదర్, మెతుకు సైదులు, ఓ. సత్యనాథ్, ఎం. మంగేష్, పి. శ్రీనివాస్‌రెడ్డి, ఎస్. ఎన్‌చారి, పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, డీఈ మనోహర, మునిసిపల్ కమిషనర్ సి. శ్రీకాంత్ పాల్గొన్నారు. అంతకు ముందు మోత్కూరు మునిసిపాలిటీలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సామేల్ మాట్లాడారు. మోత్కూరు మునిసిపాలిటీలో మెయిన్‌రోడ్డు పనులు దసరా నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.