కేసులతో కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:57 AM
బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపై ప్ర భుత్వం కక్షగట్టి కేసులు పెడుతోందని, కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోమని బీ ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
ఫ కేసీఆర్ మొక్క కాదు వేగు చుక్క
ఫ కోరుట్ల బీఆర్‌ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత భేటీ
మెట్‌పల్లి టౌన్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపై ప్ర భుత్వం కక్షగట్టి కేసులు పెడుతోందని, కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోమని బీ ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కవిత హైదారాబాద్‌లో తన నివాసంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసార్‌రావుతో, కోరుట్ల ఎ మ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో, కోరుట్ల బీఆర్‌ఎస్ కార్యకర్తలతో సోమవారం భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ కేసులకు వ్యతిరేఖంగా కొట్లాడ టానికి పార్టీ పరంగా లీగల్ టీంను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో నిజాలను ప్రచారం చేసినా, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపినా కాంగ్రెస్ ప్రభుత్వం సహించడం లేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ఈ రకంగా వ్యవహరించలేదని గు ర్తు చేశారు. కేసీఆర్ మొక్క అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అ న్నారు. కేసీఆర్ పీకేయడానికి మొక్క కాదు అని వేగు చుక్క అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.