Share News

హామీలు అమలు చేయకపోతే ఉద్యమమే : సీపీఎం

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:10 AM

సూర్యాపేట సిటీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): హామీలు అమలు చేయకపోతే మరో ఉద్యమం చేస్తామని, ఎర్రజెండాల పోరాటల ఫలితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం లగచర్లలో భూసేకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటూ నోటిఫికేషన్‌ ఇచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

హామీలు అమలు చేయకపోతే ఉద్యమమే : సీపీఎం

సూర్యాపేట సిటీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): హామీలు అమలు చేయకపోతే మరో ఉద్యమం చేస్తామని, ఎర్రజెండాల పోరాటల ఫలితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం లగచర్లలో భూసేకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటూ నోటిఫికేషన్‌ ఇచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీపీఎం సూర్యాపేట జిల్లా మూడోవ మహాసభల సందర్భంగా గాంధీపార్కులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సీపీఎం హెచ్చరికలకు తలొగ్గి ప్రభుత్వం లగచర్ల గ్రామంలో పర్యటించడానికి అనుమతి ఇచ్చిందన్నారు. లగచర్ల గ్రామ పర్యటనలో అనేక విషయాలను సీపీఎం తెలుసుకుందన్నారు. అక్కడ తెలసుకున్న విషయాలను సీఎం రేవంత్‌ రెడ్డికి వివరించామని తెలిపారు. ఎర్రజెండా పోరాటం ఫలితంగానే ప్రభుత్వం ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుందన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో స్వేచ్ఛ ఉంటుందని, సచివాలయానికి ఉన్న గేట్లను తొలగించారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఏడో గ్యారెంటీగా స్వేచ్ఛను ప్రజలకు అందిస్తానని చెప్పిన సీఎం కూడా మాజీ సీఎం కేసీఆర్‌ విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు.

దేశ సంపద కార్పొరేట్‌కు.. : జూలకంటి

బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా కట్టుబెడుతోందని జూలకంటి రంగారెడ్డి అన్నారు. దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే అంబానీ, అదానీల ఆస్తులు మాత్రం వేల కోట్లకు పెరుగుతున్నాయన్నారు.

ప్రజలపై ధరల భారం పెరిగింది : లక్ష్మి

దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజలపై ధరల భారం పెరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మహిళలు పట్టపగలు కూడా నడిచే పరిస్థితి లేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఆధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, నాగారపు పాండు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మీ, కోట రమేష్‌, పిట్టల రవి, పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:10 AM