భువనగిరిలో ఆకట్టుకున్న సంక్రాంతి సంబురాలు, క్రీడా పోటీలు
ABN , Publish Date - Jan 13 , 2024 | 12:31 AM
భువనగిరిలో మూడు రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి సంబురాలతో పాటు జిల్లా స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభమయ్యాయి.
భువనగిరి టౌన, జనవరి 12 : భువనగిరిలో మూడు రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి సంబురాలతో పాటు జిల్లా స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణారెడ్డి క్రీడోత్సవాన్ని శుక్రవారం రాత్రి ప్రారంభించి, మాట్లాడారు. ఒకే ప్రాంగణంలో ఒక వైపు దేశ వాళి, మరోవైపు సంప్రదాయ క్రీడా పోటీలు మరో వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు జరిగిన తీరు అందరినీ అబ్బురపర్చాయి. చలిని లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా చారిత్రాత్మక భువనగిరి ఖిల్లాపై శుక్రవారం కైట్ ఫెస్టివల్‌ను ఉత్సాహంగా నిర్వహించారు. స్వదేశీ దర్శన పథకానికి ఎంపికైన భువనగిరి ఖిల్లా ప్రమోషన ప్రాజెక్ట్‌లో భాగంగా ఎల్ అండ్ టీ, రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్, హెరిటేజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్‌లో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు పతంగులను ఎగురవేశారు.