Share News

Manchiryāla- ఎడతెరపి లేని వర్షం

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:43 PM

జిల్లాలో ఎనిమిది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజల జనజీవనం అస్తవ్యస్తం గా మారింది. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితులు నెల కొన్నాయి. మారుమూల గ్రామాల్లో రోడ్లన్నీ బురదమం కాగా కాలినడక వెళ్లేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Manchiryāla-   ఎడతెరపి లేని వర్షం
కోటపల్లి మండలంలో ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌లో ఐదు రోజులుగా మగ్గుతున్న పత్తి పంట

- ఐదు రోజులుగా నీటిలోనే పంట చేలు

- జిల్లాలో 27.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

- ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

- ఓసీల్లో ముందుకు సాగని బొగ్గు ఉత్పత్తి

మంచిర్యాల, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎనిమిది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజల జనజీవనం అస్తవ్యస్తం గా మారింది. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితులు నెల కొన్నాయి. మారుమూల గ్రామాల్లో రోడ్లన్నీ బురదమం కాగా కాలినడక వెళ్లేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా గోదావరి, దాని ఉపనది అయిన ప్రాణహితలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాగా ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌తో కోటపల్లి మండ లంలోని వెంచపల్లి, జనగామ, సూపాక, సిర్సా, పుల్లగాం, అన్నా రం, వేమనపల్లి మండలంలోని ముల్కలపేట, గొర్లపల్లి, రాచర్ల గ్రామా ల్లోని నీట మునిగిన వేలాది ఎకరాల పత్తిపంట ఐదు రోజులుగా నీటిలోనే మగ్గుతోంది. జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో 27.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జైపూర్‌ మండలంలో 44.3, భీమిని మండలంలో 40.0, కన్నెపల్లి మండలంలో 36.8, నస్పూర్‌ మండలంలో 36.4, నెన్నెల మండలంలో 35.3, భీమారం మండలంలో 34.1 మిల్లీమీ టర్ల వర్షపాతం నమోదైంది. బెల్లంపల్లి మండలంలో 31.7, వేమనపల్లి మండలంలో 31.0, కోటపల్లి మండలంలో 30.8, కాసిపేట మండలంలో 28,6, మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో 25.5, హాజీపూర్‌ మండలం లో 20.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

- ఎల్లంపల్లికి 23,701 క్యూసెక్కుల నీరు..

హాజీపూర్‌ మండలం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 23,701 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కడెం ప్రాజెక్టు గేట్ల ద్వారా 8412 క్యూసెక్కులతోపాటు స్థానికంగా కురిసిన వర్షాల కా రణంగా మరో 15,289 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 148 మీటర్లకు గాను ప్రస్తుతం 146.49 మీటర్ల ఎత్తుకు నీళ్లు చేరుకున్నాయి. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.109 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది.

- ఓపెన్‌ కాస్టు గనుల్లో..

వర్షాల కారణంగా జిల్లాలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లలోని ఓపెన్‌ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు, ఓబీ మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. మూడు ఏరియాల్లోని శ్రీరాంపూర్‌, ఇందారం, రామకృష్ణాపూర్‌, మందమర్రి, గోలేటి, కైరిగూడ ఓసీపీల్లో గత ఎనిమిది రోజులుగా భారీ వాహనాలు తిరిగేందుకు అవకాశంలేక బయట నిలిపి ఉంచారు. దీంతో దాదాపు రూ. 58.5 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లగా, రూ. 18 కోట్ల విలువైన ఓబీ మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి.

బెల్లంపల్లి: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని 28వ వార్డులో ఖమ్మం భూదేవికి చెందిన ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం త ప్పింది. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని వృద్ధురాలు తెలిి పంది. ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా ఎమ్మెల్యే చొరవ చూపాలని ఎంసీ పీఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్‌ కోరారు.

వేమనపల్లి: మంలంలోని సుంపుటం వద్ద ప్రాణహిత నది బ్యాక్‌ వాటర్‌ను మండల ప్రత్యేకాధికారి ఉదయ్‌కుమార్‌ శుక్రవారం పరిశీ లించారు. అధికారులు బారికేడ్లు పెట్టి రోడ్లను మూసివేసి నందున ప్ర జలు ఈ మార్గంలో వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 10:43 PM