Share News

ఆదాయ పన్ను పరిమితి రూ.15 లక్షలకు పెంచాలి

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:46 AM

ఉద్యోగస్తుల ఆదాయ పన్ను పరిమితి రూ.15 లక్షలకు పెంచాలని, నూతన పెన్షన్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోవిందు నాయక్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆదాయ పన్ను పరిమితి రూ.15 లక్షలకు పెంచాలి
క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు

టీజీయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నాయక్‌

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగస్తుల ఆదాయ పన్ను పరిమితి రూ.15 లక్షలకు పెంచాలని, నూతన పెన్షన్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోవిందు నాయక్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం టీజీఎస్‌ జగిత్యాల జిల్లా క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 60 శాతంతో కూడిన పీఆర్‌సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్‌ డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సర్వీసు రూల్స్‌ రూపొందించి ఎంఈవో, డిప్యూటీ ఈవో డైట్‌ లెక్చరర్‌ పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయాలని కోరారు. అలాగే 24 సంవత్సరాల సర్వీసు పూర్తయినవారికి గెజిటేడ్‌ హోదా లభించని ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ కల్పించాలని డిమాండ్‌ చేశారు. సర్వ శిక్షా అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన అన్నారు. ఈ సందర్భంగా సర్వ శిక్ష అభియాన్‌ సమ్మె దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నునావత్‌ రాజు, కార్యదర్శి జరుపుల గోవింద్‌, రమేష్‌ రాథోడ్‌, రఘు, ప్రకాష్‌, మోతీలాల్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:46 AM