Telangana: ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్.. కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
ABN , Publish Date - Apr 07 , 2024 | 09:12 PM
పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఫామ్ హౌస్ పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలను మోసం చేసేందుకు పొలంబాట పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేట: పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఫామ్ హౌస్ పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలను మోసం చేసేందుకు పొలంబాట పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శవాల మీద పేలాలు ఏరుకునే కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలు ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టి వారిని జైలుకు పంపిస్తామని తెలిపారు.
భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి 3 - 5 లక్షల భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రూ.2,000 కోట్లతో శ్రీశైలం సొరంగ మార్గం పూర్తిచేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా కరవు పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.