Home » Komati Reddy Venkat Reddy
గత ప్రభుత్వ హయంలో ఫార్మా సిటీ పేరుతో రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఫార్మా సిటీ పేరుతో నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, దానికి వ్యతిరేకంగా తామే పోరాటం చేశామని చెప్పారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఓఆర్ఆర్ అమ్మకంపై బీఆర్ఎస్ సర్కారును ఆక్షేపించారు. గత ప్రభుత్వం చేయని పనులను 15 నెలల్లో చేసినట్లు పేర్కొన్న ఆయన, ఆర్ఆర్ఆర్ భూసేకరణ, పర్యావరణ అనుమతుల విషయంలో వివరణ ఇచ్చారు
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నల్లగొండ యూనిట్ కార్యాలయంలో జరిగిన కార్ అండ్ బైక్ రేస్ డ్రా కార్యక్రమానికి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుతులకు సంబంధించి డ్రా తీశారు.
రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ 2024-25 కోసం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించింది. 8,128 కేంద్రాలు ఏర్పాటు చేసి, 137 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. అంగీకరించిన కనీస మద్దతు ధరతో పాటు, సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చే అంశం ప్రకటనైంది.
మేం అటు ఇటు ఎక్కడికీ పోం. పదేళ్లు ఇక్కడే (అధికారంలో) ఉంటాం. మీ (బీఆర్‌ఎ్‌స)లాగా ఎక్కువ మాట్లాడం.. పని ఎక్కువ చేస్తాం’’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో అన్నారు.
Minister Komatireddy Venkat Reddy: పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన అబద్ధాలకు అసలు శిక్షలే సరిపోవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పదిలక్షల అబద్ధాలు ఆడారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు.
సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. ఇందులో స్పీకర్ ప్రసాద్‌కుమార్ కూడా పాలుపంచుకున్నారు.
కేటీఆర్ అంటే ఎవరో ప్రజలకు కూడా తెలియదని, ఆయన తండ్రి చాటు బిడ్డ అని, ఆయన తమలాగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
రూ.1000 కోట్లతో ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వల డిస్ట్రిబ్యూటరీ లైనింగ్, మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన వాగ్ధానాల్లో సగం పూర్తి చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.