నకల్ పుషప్స్‌లో కృష్ణారెడ్డి రికార్డ్
ABN , Publish Date - Feb 09 , 2024 | 12:21 AM
నకల్ పుష్‌ప్సలో చింతల కృష్ణారెడ్డి ప్రపంచ రికార్డ్ సాధించారు. మేడ్చల్‌జిల్లా, ఘట్‌కేసర్ మండలం, అంకుషాపూర్‌కు చెందిన చింతల కృష్ణారెడ్డి నకల్ పుషప్స్ విభాగంలో నిమిషంలో 133 నకల్ పుషప్స్ చేసి ప్రపంచ రికార్డ్ సాధించారు.
నిమిషంలో 133 పుషప్స్
ఘట్‌కేసర్ రూరల్, ఫిబ్రవరి8: నకల్ పుష్‌ప్సలో చింతల కృష్ణారెడ్డి ప్రపంచ రికార్డ్ సాధించారు. మేడ్చల్‌జిల్లా, ఘట్‌కేసర్ మండలం, అంకుషాపూర్‌కు చెందిన చింతల కృష్ణారెడ్డి నకల్ పుషప్స్ విభాగంలో నిమిషంలో 133 నకల్ పుషప్స్ చేసి ప్రపంచ రికార్డ్ సాధించారు. వరల్డ్ వైడ్ బుక్ అఫ్ రికార్డ్ ప్రతినిధులు గురువారం కృష్ణారెడ్డికి ప్రశంసాపత్రంతో పాటు మెడల్‌ను బహుకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమిషంలో 133 నకల్ పుషప్స్ చేయడంతో ఈ గౌరవం దక్కిందని, త్వరలో గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం సాధన చేయడం వల్లే ప్రపంచ రికార్డ్‌లో స్థానం దక్కిందని తెలిపారు.