గృహ నిర్మాణ సంస్థ సీఈగా చైతన్యకుమార్
ABN , Publish Date - Dec 25 , 2024 | 04:55 AM
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజినీర్ (సీఈ)గా ఎం. చైతన్యకుమార్ నియమితులయ్యారు. ఆయన్ను ఆ పోస్టులో నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజినీర్ (సీఈ)గా ఎం. చైతన్యకుమార్ నియమితులయ్యారు. ఆయన్ను ఆ పోస్టులో నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని థౌర్యాతండా వాసి అయిన చైతన్య 1994లో వర్క్ ఇన్స్‌పెక్టర్ పోస్టులో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. తాజాగా డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ నిర్ణయం మేరకు సీనియారిటి ప్రకారం చైతన్యకుమార్‌ను ప్రభుత్వం సీఈగా నియమించింది. ఈ మేరకు పదోన్నతి కల్పించిన ఉత్తర్వులను శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆయనకు అందించారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో చైతన్య కీలకంగా వ్యవహరించనున్నారు.