Share News

పండించిన ప్రతీ గింజను కొంటాం

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:33 PM

We buy every seed that is harvested రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే వా కిటి శ్రీహరి అన్నారు.

పండించిన ప్రతీ గింజను కొంటాం
పామిరెడ్డిపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

పండించిన ప్రతీ గింజను కొంటాం

- అపోహలు వీడి కేంద్రాలలోకి ధాన్యాన్ని తీసుకురండి

- మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

ఆత్మకూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే వా కిటి శ్రీహరి అన్నారు. మండలంలోని పిన్నంచర్ల, ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాలను బుధవారం కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగ రాజు గౌడ్‌, పార్టీ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ప్రభు త్వం కల్పిస్తుందని తెలిపారు. బోనస్‌ ఇవ్వడం కలలో మాట అని ప్రతిపక్ష పార్టీలు, మధ్య దళా రులు రైతులను ప్రలోభ పెట్టి అధికార పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాం గ్రెస్‌ పార్టీ మాట ఇస్తే మడప తిప్పే పార్టీ కాదు అని గుర్తు చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, పరమేష్‌, శ్రీని వాసులు, తులసిరాజ్‌, రహమతుల్లా, మని వర్ధన్‌రెడ్డి, కాజన్న, ప్రహ్లాద్‌ పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

అమరచింత: రైతు సంక్షేమం, వారి అన్ని విఽ దాల అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పామిరెడ్డిపల్లి రైతు వేదిక వద్ద సన్నరకం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్‌డీవో ఉమాదేవి, మార్కెటింగ్‌ డీపీఎం అరుణతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రవి కుమార్‌, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏపీఎం శ్రీని వాసులు, ఏవో అరవింద్‌, వెంకటమ్మ, శ్రీదేవి, పావని, అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:33 PM